English | Telugu
Illu illalu pillalu : నర్మదపై భద్రవతి ఫైర్.. వార్నింగ్ ఇచ్చి పంపించిందిగా!
Updated : Nov 5, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -308 లో.....భద్రవతి అక్రమంగా భూమిని కబ్జా చేసిందని తన ల్యాండ్ ని నర్మద సీజ్ చేయిస్తుంది. అది తెలిసి భద్రవతి, సేనాపతి అక్కడికి వచ్చి నర్మదతో గొడవ పెట్టుకుంటారు. మరొకవైపు శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్తుంది. మీరు అన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేశారు.. ఇప్పుడు ఆ విశ్వగాడు ప్రతీదానికి అమూల్యని అక్కడికి తీసుకొనిరా.. ఇక్కడికి తీసుకొనిరా అంటున్నాడు. వాడు అమూల్యకి ప్రపోజ్ చేసాడు.
ఇప్పుడు ఆ అమూల్య వాళ్ళ నాన్న కి చెప్తానని వెళ్తే అడ్డుపడ్డాను.. ఒకవేళ మావయ్య గారికి చెప్తే దీని వెనకాల నేనే ఉన్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని తన భయం గురించి తన వాళ్ళకి శ్రీవల్లి చెప్తుంది. ఆ తర్వాత తన భూమిని సీజ్ చేసారని సేనాపతి తాగేసి వచ్చి.. రామరాజు ఇంటిమీదకి గొడవకి దిగుతాడు. దాంతో సాగర్, చందు, ధీరజ్ ముగ్గురు వాళ్ళపైకి గొడవకి వెళ్తారు. రామరాజు గాడు మమ్మల్ని ఎదుర్కునే ధైర్యం లేక కోడలిని ఉసిగొలిపాడని తిడతాడు. దాంతో సేనాపతి దగ్గరికి నర్మద వెళ్లి మీరు అక్రమంగా ల్యాండ్ కబ్జా చేశారు సీజ్ చేసాం.. అక్కడ మ్యాటర్ ఏదైనా ఉంటే ఆఫీస్ కి రండి.. ఇలా ఇంటికి వచ్చి గొడవపడకండి అని నర్మద చెప్తుంది.
ఆ తర్వాత సేనాపతి అన్నమాటలు ధీరజ్ గుర్తుచేసుకొని ఈ మనిషి.. మీ నాన్న అంటూ ప్రేమ ముందు సేనాపతిని తిడతాడు. ఒరేయ్ ఆపురా అని ప్రేమ అంటున్నా కూడా ధీరజ్ వినకుండా తిడతాడు. దాంతో తన చెయ్ గట్టిగా కొరుకుతుంది. వామ్మో దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలని ధీరజ్ అనుకుంటాడు. మరొకవైపు వేదవతి డల్ గా కూర్చొని ఉంటుంది. అప్పుడే నర్మద వస్తుంది. నీతో కాస్త మాట్లాడాలని నర్మదతో వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.