English | Telugu

Illu illalu pillalu : పెద్దకోడలు రిక్వెస్ట్ చేయడంతో భోజనం చేసిన రామరాజు.. శ్రీవల్లి దొరికిపోతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -326 లో.. సాగర్ ఎదురుతిరిగి మాట్లాడడంతో రామరాజు డల్ గా ఉంటాడు. ఏవండీ భోజనం చేద్దాం రండి అని వేదవతి పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదని రామరాజు అంటాడు. నిన్నటి నుండి ఏం తినలేదని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. దొరికింది ఛాన్స్ అని ఇంకా ఈ నర్మద, ప్రేమ ఇద్దరిని ఇరికించాలని శ్రీవల్లి అనుకుంటుంది.

పాపం మావయ్య గారిని చూస్తుంటే జాలిగా ఉంది. ప్రేమ జాబ్ చేస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చొక్కా పట్టుకొని చింపారని శ్రీవల్లి గతాన్ని గుర్తుచేస్తుంది. ప్రేమ, నర్మదలపై ఇంకా కోపం కలిగేలా చేస్తాడు. ఆ తర్వాత భోజనం చెయ్యండి మావయ్య అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. ఇంటికి పెద్ద కోడలిగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావమ్మ అని రామరాజు అంటాడు. ఆ తర్వాత పదండి తిందామని రామరాజు అంటాడు. కాసేపటికి పూజ కోసం నర్మద రెడీ అవుతుంది. సాగర్ డల్ గా ఉంటే తనకి నచ్చజెప్పుతుంది.

మరొకవైపు రేవతితో తిరుపతి మాట్లాడతాడు. అప్పుడే రామరాజు వచ్చి ఏంట్రా వాళ్ళతో మాట్లాడుతున్నావని అంటాడు. ఏంటి అండి ఎన్నటికి ఉన్నా రెండు కుటుంబాలు కలుస్తాయని వేదవతి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి నగలు అన్నీ వేసుకొని మురిసిపోతుంది. అప్పుడే తిరుపతి వస్తాడు. ఎక్కడ ఇవి ప్రేమ నగలు అని గుర్తుపడుతాడో అని చీర కప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.