English | Telugu
Illu illalu pillalu : సాగర్ ఎగ్జామ్ రిజల్ట్స్.. ప్రేమ పోలీస్ ప్రాక్టీస్!
Updated : Nov 20, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -320 లో... సేనాపతి స్టేషన్ నుండి వచ్చి ప్రేమ తో మాట్లాడుతాడు. నిన్ను ఎంతో గారాబంగా పెంచాను కానీ నువ్వు ఇలా చేస్తావ్ అనుకోలేదని సేనాపతి అంటాడు. మీరు అన్యాయంగా నర్మద అక్కని లంచం కేసులో ఇరికించారు.. అది అన్యాయం కాదా అని ప్రేమ అంటుంది. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏంటని సేనాపతి ఎమోషనల్ అవుతాడు.
దాంతో ప్రేమ బాధపడుతుంది. ప్రేమ డల్ గా ఉందని తనని నవ్వించడానికి ఇంట్లో వాళ్లంతా ట్రై చేస్తారు. డాన్స్ చేస్తుంటారు. అయిన ప్రేమ బాధపడుతూ ఉంటుంది. నర్మద వచ్చి ప్రేమ చెవిలో ఏదో చెప్తుంది. అది విని నవ్వుతుంది.. ఏం చెప్పావని నర్మదని వేదవతి అడుగుతుంది. అలా అందరు చెవిలో చెప్పుకొని నవ్వుకుంటారు. చివరగా తిరుపతి వరకు విషయం వచ్చేసరికి ఏంటి విషయం అని ముగ్గురు అన్నదమ్ముళ్లు అడుగుతారు. ఏం లేదు రా డాన్స్ చేసేటప్పుడు మీ ప్యాంటు జారిందని నవ్వుతున్నారని తిరుపతి చెప్పగానే అందరి ముందు పరువు పోయిందిగా అని అన్నదమ్ముళ్లు అనుకుంటారు.
మరుసటిరోజు నర్మద త్వరగా నిద్ర లేచి సాగర్ ని నిద్రలేపుతుంది. ఈ రోజు నీ VRO రిజల్ట్స్ అని చెప్తుంది. వచ్చేటివి వస్తాయి కదా అని బద్ధకంగా మాట్లాడుతుంటే నర్మద పట్టుబట్టి సాగర్ ని లేపుతుంది. మరొకవైపు రన్నింగ్ ప్రాక్టీస్ కి వెళ్లాలని ప్రేమను ధీరజ్ నిద్ర లేపుతాడు. నర్మద, సాగర్ రెడీ అయి బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతారు. మరొకవైపు ప్రేమ, ధీరజ్ రన్నింగ్ కి బయల్దేర్తారు. కానీ ఇంటి ముందు ముగ్గు వేస్తూ శ్రీవల్లి ఉంటుంది. తనని చూసి లోపలే ఆగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.