Read more!

English | Telugu

ఆదికి నిజంగానే పెళ్లయిందా ?


ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ని మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అని అనేవారు. పెళ్ళెప్పుడు అని సెటైర్స్ వేసేవారు. ఇప్పుడు హైపర్ ఆది మీద కూడా అలాగే సెటైర్స్ వేస్తుంటే ఆయన నిజంగానే పెళ్లి చేసుకుని ఆడియన్స్ కి షాకిచ్చాడు. అవునా...ఇదంతా నిజమేనా అనుకునే లోపే ఆయన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. సుధీర్, ప్రదీప్ పెళ్లి చేసుకున్నాకే తాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన ఆది ఇంత సడెన్గా పెళ్లి చేసేసుకున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు చాలామంది. అయితే ఇప్పుడు  ఆది సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న కొన్ని ఫోటోలు రిలీజ్ అయ్యాయి. 

ఐతే ఆదికి నిజంగానే పెళ్లయిందా..లేదా ఏదైనా షూటింగ్ లో భాగంగా ఇలా పెళ్లి సీన్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది. హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంచలంచెలుగా ఎదిగి టీమ్ లీడర్ అయ్యాడు. అన్ని షోస్ లో స్ట్రాంగ్ పర్సన్ గా నిలబడ్డాడు. యూట్యూబ్ లో ఇతని స్కిట్స్ కి మిలియన్స్ ఆఫ్  వ్యూస్ వస్తుంటాయి. బుల్లితెర మీద మాత్రమే  కాదు వెండితెరపై కూడా బిజీ కమెడియన్ గా మారిపోయాడు ఆది. 

తర్వాత ‘ఢీ’ లో కూడా కొన్ని రోజులు సందడి చేశాడు. ఇప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ‘సుడిగాలి’ సుధీర్ తర్వాత అంతగా పేరు తెచ్చుకున్నాడు హైపర్ ఆది.