English | Telugu
హైపర్ ఆదికి హగ్గులు...సుధీర్ కు ఫ్లైయింగ్ కిస్సులు
Updated : May 26, 2022
సుడిగాలి సుధీర్ బుల్లితెర కామెడీ షోలలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ తో కనిపించడం మానేసిన సుడిగాలి సుధీర్ `శ్రీదేవి డ్రామా కంపనీ`లో రెగ్యులర్ గా కనిపిస్తూ ఈ షోని మరింతగా పాపులర్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షోలో హీరోయిన్ హెబ్బా పటేల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నానా రచ్చ చేసింది. ఏకంగా రచ్చకే మారుపేరు అయినటువంటి సుడిగాలి సుధీర్ కె ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ హెబ్బా పటేల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సుడిగాలి సుధీర్ యాంకర్ గా `శ్రీదేవి డ్రామా కంపనీ` కామెడీ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ని తాజాగా విడుదల చేశారు. తాజా ఎపిసోడ్ కి హీరోయిన్ హెబ్బా పటేల్ గెస్ట్ గా విచ్చేసింది. హాట్ హాట్ అందాలతో క్యూట్ క్యూట్ లుక్స్ లో కనువిందు చేసింది. సుడిగాలి సుధీర్ తాను హీరోగా ఓ సినిమా చేస్తున్నానని, అందుకు హీరోయిన్ కావాలని హేబ్బా పటేల్ ని అడుగుతాడు. అయితే అందుకు అంగీకరించని హెభా పెదవి విరుస్తుంది. దీంతో ఆమని కల్పించుకుని నువ్వు ఆమెకు నచ్చలేదేమో సుధీర్ అంటుంది. ఆ మాటలు విన్న హెభా వెంటనే `బాగా నచ్చాడు` అంటూ సుధీర్ కు ఫ్లైయింగ్ కిస్ లు ఇవ్వడం మొతలు పెడుతుంది.
అనంతరం తాగుబోతు రమేష్, ఇమ్మాన్యుయేల్ కలిసి చేసిన హంగామా నవ్వులు పూయించింది. ఆ తరువాత హైపర్ ఆది, రామ్ ప్రసాద్ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా హైపర్ ఆది కి హెబ్బా పటేల్ వరుసగా హగ్గులు ఇస్తూ నానా రచ్చ చేసింది. ఆటలో రాంప్రసాద్ కూడా నాకూ అంటూ పోటీపడ్డాడు. `శ్రీదేవి డ్రామా కంపనీ` కి ఎవరైనా వస్తే ఒక ఆనవాయితీ వుందని, ముందుగా బావలకు హగ్గు ఇవ్వాలంటాడు ఆది అది విన్న వెంటనే హెబ్బా పటేల్ . ఆదికి టైట్ హగ్గ్ ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు. పక్కన వున్న ఆటొ రామ్ ప్రసాద్ అయితే నాకూ అంటూ షాకుతో నోరెళ్లబెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.