English | Telugu

Jayam serial : గతం చెప్పి భయపెట్టాలనుకున్న వీరు.. గంగ మాస్ వార్నింగ్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -125 లో......గంగకి ఎలా ఉండాలో.. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించండి అని ప్రీతీతో రుద్ర చెప్తాడు. అలా ఏం లేదు.. గంగలా ఎవరు ఉండలేరు.. తనకి నచ్చినట్లు ఉండనివ్వు అన్నయ్య అని ప్రీతీ చెప్తుంది. మరొకవైపు గంగని పెద్దసారు పిలిచి.. ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలివి డిగ్నిపైడ్ గా ఉండాలని చెప్తాడు. ఏది పడితే అది మాట్లాడకూడదని పెద్దసారు అంటాడు.

ఆ తర్వాత ఏం పని చేసినా పెద్దసారుకి చెప్తుంది. పెద్దసారు వంట ఏం చేయాలి. వాటర్ ఆన్ చెయ్యాలా..‌ ఆఫ్ చెయ్యాలా.. ఇలా ప్రతీది అడుగుతుంది. ఆ తర్వాత గంగకి వీరు ఎదురుపడుతాడు. నా దారికి అడ్టులేండి అని గంగ అనగానే నా దారికే నువ్వు అడ్డు వస్తున్నావని కోపంగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఒక అమ్మాయిని రూమ్ కి రమ్మని పిలిచాడని, వాడి కార్ నెంబర్ చూసి కంప్లైంట్ ఇచ్చావ్ కదా.. అది ఎవరో కాదు నేనే అని వీరు అనగానే గంగ షాక్ అవుతుంది. అలా నిజాలన్నీ వీరు చెప్తాడు. అయితే గంగ ఏ మాత్రం భయపడకుండా వీరుకి వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు పెద్దసారు పంతులిని పిలిపిస్తాడు. గంగ, రుద్రకి ఈ రోజు రిసెప్షన్ అని చెప్తాడు. వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టమని పెద్దసారు అనగానే.. శకుంతల షాక్ అవుతుంది. దాంతో పంతులు ముహూర్తం పెడతాడు.

గంగ కాఫీ తీసుకొని వచ్చి.. శాంతి ముహూర్తం అంటే ఏంటని గంగ అడుగుతుంది. కార్యం అని పంతులు అంటాడు. అంటే ఏంటని గంగ అడుగుతుంటే పంతులు చెప్పడానికి సంకోచిస్తాడు. దాంతో అప్పుడే ప్రీతి వచ్చి గంగని పక్కకు తీసుకొని వెళ్లి ఫస్ట్ నైట్ అని చెప్పగానే గంగ సిగ్గుపడుతుంది. పెద్దసారు చెప్పడంతో గంగ, రుద్ర ఇద్దరు పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వీరు, ఇషిక కలిసి రిసెప్షన్ లో గంగ పరువుపోయేలా ప్లాన్ చేస్తారు. తరువాయి భాగంలో గంగకి ఓవర్ మేకప్ వేసేలా ఇషిక ప్లాన్ చేస్తుంది. గంగ ఓవర్ మేకప్ తో అందరి ముందుకు వచ్చేసరికి అందరు అసహ్యించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.