English | Telugu
త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో ఎక్స్ప్రెస్ హరి మూవీ ?
Updated : Jun 23, 2025
కాకమ్మ కథలు షో ఆహా ప్లాటుఫారం మీద మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ప్రతీ వారం బుల్లితెరకు సంబందించిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది తేజస్విని మడివాడు. అలాగే వాళ్ళ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ని చెప్తూ ఉంటుంది. ఇక రీసెంట్ ఎపిసోడ్ కి అష్షు రెడ్డి, ఎక్స్ప్రెస్ హరి వచ్చారు. ఐతే హరి పాస్ట్ గురించి చెప్పి తేజుని ఏడిపించేసాడు. ఐతే హరి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో తేజు చెప్పేసింది. ఇక ఫ్యూచర్ లో జూనియర్ ఎన్టీఆర్ పిక్ ని తేజు చూపించేసరికి హరి ఆశ్చర్యపోయాడు. "హరి నువ్వు ఎప్పటినుంచి తారక్ అన్నతో ఫోటో దిగడం కోసం వెయిట్ చేసి చేసి మిస్ అయ్యావని విన్నాను. నేను తారక్ అన్నతో ఫోటో ప్రామిస్ చేయగలను.
ఫోటో ఇప్పించగలను. ఐతే నాకెందుకో తారక్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకుంటావని ఆయనకు నువ్వు రాస్తావని మా కాకమ్మ చెప్తోంది.గట్టిగా అనుకో అది జరుగుతుంది " అంది తేజు. " గట్టిగా అనుకుంటా. గొంతు పోయేంత గట్టిగా అనుకుంటా జరుగుతుంది అంటే" అంటూ హరి ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఇక తేజు ఐతే "ఎన్టీఆర్ గారు మీరు ఈ షో చూస్తుంటే మీ ఫ్యాన్ ఇక్కడ మీతో ఫోటో దిగడానికి తహతహలాడుతున్నాడు. మీ అన్నపూర్ణ స్టూడియోస్ బయట వెయిట్ చేసిన రైటర్. అతను చాలా టాలెంటెడ్. కావాలంటే రెండు పీకండి.. కానీ పిలిచి ఫోటో దిగండి" అంటూ చెప్పింది. ఇక హరి కష్టాలు విన్న తేజు " ఇక నువ్వు కష్టాలు పడాల్సిన సమయం ఐపోయింది. నువ్వు ఫుడ్ కోసం బాధపడక్కర్లేదు. ఎందుకంటే అష్షు నీకు లైఫ్ లాంగ్ ఫుడ్ పెడుతుంది" అంది. "హరినే నాకు ఫుడ్ పెట్టాలి" అంది అష్షు. "ఇప్పుడు నువ్వు అందరికంటే ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నావ్ కాబట్టి నువ్వే ఫుడ్ పెట్టాలి. నీకు మంచి అమ్మాయి దొరికి మంచి పండు లాంటి పిల్లలు పుట్టాలని, నీ లైఫ్ నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలా ఉండాలని కోరుకుంటున్నా " అంటూ విష్ చేసింది తేజు.
