English | Telugu

Eto Vellipoyindhi Manasu : సీతకి నాపై ప్రేమ...సందీప్, శ్రీలతల ప్లాన్.. 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -193 లో.....నందిని తను పంపించిన సూట్ వేసుకొని వస్తాడని ఎదరుచూస్తుంది. హారికని కుడా తన వెంట ఉండమని చెప్తుంది. ఎంత సేపు ఇలా వెయిట్ చెయ్యాలి నాకు వర్క్ ఉందని హారిక అంటుంది. అయినా నేనే కంపెనీ చైర్మన్ ని చెప్తున్నాను.. అయిన ఇబ్బంది ఏంటని నందిని అంటుంది. సీతాకంత్ నువ్వు పంపిన సూట్ వేసుకుంటాడనుకుంటున్నావా తన భార్య అంటే ఇష్టం లేనిదే అతను తనతో ఉంటున్నాడా అని హారిక అంటుంది. నేను అంటేనే ఇష్టం ఖచ్చితంగా సూట్ వేసుకొని వస్తాడని నందిని కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. ఒకవేళ వేసుకొని రాకుంటే వదిలేస్తావా అని హరిక అంటుంది.

మరొకవైపు అందరు టిఫిన్ చేస్తుంటారు. శ్రీలత తినకుండా సైలెంట్ గా ఉంటుంది. తినండి అత్తయ్య అని శ్రీవల్లి అంటుంది. అది ఉండగా నన్ను ఎక్కడ తిననిస్తుందని శ్రీలత అంటుంది. అయిన పర్లేదు తినండి అని శ్రీవల్లి అనగానే.. శ్రీలత తినడానికి ఇడ్లీ పెట్టుకుంటుంటే అత్తయ్య అని రామలక్ష్మి అంటుంది. దాంతో శ్రీలత తినకుండా ఆగిపోతుంది. ఏంటి రామలక్ష్మి మా అమ్మని తిననివ్వడం లేదని సీతాకాంత్ అంటాడు. మీ అమ్మకి పూజభంగం అవుతుందని రామలక్ష్మి అనగానే.. అవునని శ్రీలత అంటుంది. ఆ తర్వాత వదిన.. ఎప్పుడు అన్నయ్య పక్కన కాదు మమల్ని కూడా పట్టించుకోమని సిరి అంటుంది. సీతాకాంత్ పక్కనే రామలక్ష్మి ఉండడం వల్లే కంపెనీ లాభంలో వెళ్తుందని పెద్దాయన అంటాడు. అవును రామలక్ష్మి కృషి చాలా ఉంది అందుకే యూనిట్ కీ తన పేరు పెడుతున్నానని సీతాకాంత్ అంటాడు.

రామలక్ష్మి కన్నా పెద్ద జాబ్ నీదే అయిన మిమ్మల్ని కాకుండా దాన్ని పొగుడుతూన్నారని సందీప్ తో శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత శ్రీవల్లి కోపంగా కావాలనే సీతాకాంత్ సూట్ పై సాంబార్ పడేస్తుంది. దాంతో చేంజ్ చేసుకుంటానని గదిలోకి వెళ్తాడు సీతాకాంత్. అప్పుడే రామలక్ష్మి నందిని పంపిన సూట్ ఇస్తుంది. పాపం రామలక్ష్మి తెచ్చిన సూట్.. ఇక లేట్ చెయ్యకూడదు.. ఇప్పుడే వేసుకుంటానని సూట్ వేసుకుంటాడు. మరొకవైపు సందీప్, శ్రీవల్లిలు చాటుగా ఇడ్లీ తింటున్న శ్రీలత దగ్గరికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళని అలాగే వదిలేస్తే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. అందుకే వాళ్ళని లేపేయ్యాలని శ్రీవల్లితో సందీప్ అంటాడు. మరొకవైపు సీతాకాంత్ సూట్ వేసుకొని రావడం చూసి నందిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా ఇప్పటికైనా సీతకి నాపై ప్రేమ ఉందని నమ్ముతావా అంటూ నందిని తన హ్యాపీనెస్ ని హారికతో షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...