English | Telugu
వర్షంలో వేదకు హగ్గిచ్చి షాకిచ్చిన యష్
Updated : May 27, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నె జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా స్టార్ మా` లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టార్ ప్లస్ లో ఏడేళ్ల క్రితం ప్రసారమై సూపర్ హిట్ అనిపించుకున్న `యే హై మొహబ్బతే` కు రీమేక్ గా ఈ సీరియల్ ని తెలుగులో రూపొందించారు. కన్నడ, కోల్ కతా నటుల కలయికలో రూపొందిన ఈ సీరియల్ టాప్ లో ట్రెండ్ అవుతూ ఆకట్టుకుంటోంది. కన్నడ నటుడు నిరంజన్, కోల్ కతా నటి డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు.
మిన్ను నైనిక, బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సుమిత్ర పంపన ఇతర పాత్రల్లో నటించారు. స్టార్ మా తో పాటు ఈ సీరియల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పాప కోసం పెళ్లి చేసుకున్న ఓ డాక్టర్ కథగా ఈ సీరియల్ ని రూపొందించారు. ఖుషీ స్కూల్ లో స్కూల్ డేని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వేద, ఖుషీ కలిసి వెళతారు. అయితే వేదని సర్ ప్రైజ్ చేయాలని యష్ ఇంటికి వచ్చిన వాడల్లా వెనక్కి తిరికి వెళ్లి ఆలస్యంగా స్కూల్ కి వెళతాడు. అయితే అప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ కావడంతో స్కూల్ సిబ్బంది యష్ ని ముందు సీట్ల వరకు వెళ్లనివ్వకుండా వెనకాలే ఆపేస్తారు.
అక్కడి నుంచే తన కూతురుని చూస్తూ మురిసిపోతాడు యష్. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న అభిమన్యు బెస్ట్ స్టూడెంట్ కి తన చేతుల మీదుగా స్కాలర్ షిప్ ఇస్తానని ప్రకటించి స్కూల్ ఫస్ట్ గా నిలిచిన ఖుషీకి షీల్డ్ తో పాటు స్కాలర్ షిప్ ఇవ్వడానికి స్టేజ్ పైకి వెళతాడు. ఖుషీ .. అభిమన్యు అందించే షీల్డ్ ని , స్కాలర్ షిప్ ని అందుకోవడానికి నిరాకరిస్తుంది. అది గమనించిన వేద వెళ్లి సర్ది చెప్పడంతో తీసుకుంటుంది. ఆ తరువాత తన తల్లి వేద గురించి, తండ్రి యష్ గురించి గొప్పగా చెబుతూ మురిపిపోతుంది. అది భరించలేని మాళవిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వేద, - యష్ ల కోసం వారి అపార్ట్ మెంట్ కు బయలుదేరుతుంది. వర్షం పడుతుంటే ఆ వర్షంలో వేద, యష్ తడుస్తూ వుంటారు. వెంటనే వేదని కౌగిలించుకుని ఐ లవ్ యూ చెప్పి షాకిస్తాడు యష్. ఇదంతా కారులో కూర్చుని గమనించిన అభిమన్యు, మాళవిక రగిలిపోతుంటారు. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.