English | Telugu

కామెడీయన్ గా లోపలికి వచ్చావ్.. ఒక హీరోలా బయటకి రావాలబ్బా!

బిగ్ బాస్ సీజన్-9 లో ఈ వారం ఫ్యామిలీ వీక్ సాగుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయల్ తల్లి వచ్చింది. మొదటగా తన తల్లి పట్టీల సౌండ్ విని ఇమ్మాన్యుయల్ హౌస్ మొత్తం వెతికాడు. ఇంతలో హౌస్ లోపలి నుంచి తన తల్లి రాగానే ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అయిపోయాడు. ఇక వెంటనే ఇమ్ము తల్లీ అంటూ తన కొడుకును పట్టుకొని ముగిసిపోయింది.

తన తల్లి చేతికి ఉన్న గాజులు చూపిస్తూ నేను కొనిచ్చినవే ఈ గాజులు అంటూ ఇమ్మూ గర్వంగా చెప్పాడు. నెక్స్ట్ లోపలికి తీసుకెళ్లి తన తల్లితో మాట్లాడాడు. పొట్టేసుకొని మాటిమాటికి ఆ టోపీ మీద పడుతున్నావ్ చూడు.. ఈ పొట్టబోయ్ ఈడ గుద్దుకుంటుంటే నా పొట్ట అక్కడ ఎగురుతుందంటూ కెప్టెన్సీ టాస్క్ గురించి చెప్తూ కామెడీ చేసింది. ఏ బంగారాన్ని వద్దనుకున్నానో ఆ బంగారం ఇయ్యాల.. రెండు రాష్ట్రాలకి పేరు తెస్తున్నాడే బంగారం.. నువ్వు ఏడవద్దు డాడీ.. ఏడవబాకు ఇమ్మూ తల్లి.. నువ్వు ఏడిస్తే మాకు ఏడుపొస్తది.. మా ఎనర్జీ పోతది అబ్బా అంటూ ఎమోషనల్ అయ్యింది.

కమెడియన్‌గా వచ్చావ్ లోపలకి.. ఒక హీరోలా బయటికి రావాలబ్బా అంటూ కప్పు గురించి చెప్పుకొచ్చింది. నెక్స్ట్ హౌస్‌మేట్స్ అందరితో చాలా ప్రేమగా మాట్లాడింది ఇమ్మాన్యుయల్ తల్లి. ఏమ్మా దివ్య ఏ మాత్రం రాణిలైతే మాత్రం నా కొడుకు చేత డ్యాన్సులు వేయిస్తారా అంటూ ముఠా మేస్ట్రి స్టెప్పులేసి నవ్వించారు. ఇక తనూజని చూస్తూ అయిన నా కొడుకు నడుమేంటమ్మా అలా గిల్లేశావ్.. ఈ నడుమంతా అరిగిపోయింది కదా అంటూ కామెడీ చేశారు. దీనికి తనూజ తెగ నవ్వుకుంది. లోఫర్ సినిమాలోని అమ్మ పాట అయిన సువ్వి సువ్వాలమ్మా సాంగ్ పాడి అందరినీ ఎమోషనల్ చేసేశాడు ఇమ్మాన్యుయల్. ఇమ్మూ తల్లి మాటలకి.. ఆమె అమాయకత్వానికి అటు హౌస్ మేట్స్ ఇటు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇమ్మూ తల్లి కూడా వచ్చేయడంతో ఇక హౌస్‌మేట్స్ అందరి ఫ్యామిలీ వీక్ పూర్తయిపోయినట్లే.