English | Telugu
ఆర్యవర్ధన్ అసలు రంగు అనుకి తెలియనుందా?
Updated : Feb 3, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` ఫేమ్ శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జయలలిత, రామ్ జగన్, జ్యోతిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. గత కొన్ని వరాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. గత జన్మలో చనిపోయిన రాజనందిని ఆర్యపై మనసు చావక మళ్లీ మరో యువతి రూపంలో వస్తుంది.. అన్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సీరియల్ ని ఉత్కంఠభరిత సన్నివేశాలతో రూపొందించారు.
Also Read:దేవికి ఆదిత్య ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏంటీ?
థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సీరియల్ తాజాగా కీలక మలుపులు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆర్యవర్ధన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అను రాజనందిని హత్య వెనకున్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆమె సోదరి రాగసుధని వెతకడం మొదలుపెడుతుంది. అయితే అనూహ్యంగా ఆర్యవర్ధన్ ఆఫీస్‌లోకి ఎంటరైన రాగసుధ.. జెండేని గాయపరిచి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. ఆ తరువాత తనని యాక్సిడెంట్ చేసి చంపేయమని జెండే తన అనుచరులకు చెప్పడం.. వారు ప్రయత్నించిన క్రమంలో రాగసుధ.. అను తల్లిదండ్రుల కారణంగా ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది.
Also Read:రౌడీలని అల్లాడించిన డాక్టర్ బాబు
రాగసుధ కాలు బెనకడంతో ఆమెని తమ ఇంటికి తీసుకెళతారు అను తల్లిదండ్రులు.. కట్ చేస్తే ఆర్యవర్ధన్ ఆఫీస్‌లో ఏదో జరుగుతోందని గమనించిన మీరా ఆ విషయాన్ని కనిపెట్టాలని, అసలు రాగసుధ ఎవరు? అమె కోసం జెండే రహస్యంగా ఏం చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ వున్న గదికి వెళ్లి వీడియో చూస్తుంది. అందులో రాగసుధ అనుమానాస్పదంగా తిరుగుతూ..ఆర్యవర్ధన్ ఫొటో చూసి రగిలిపోతున్న దృశ్యాలు మీరా చూస్తుంది. అదే వీడియోని అనుకు చూపించాలని అనుని రమ్మని ఫోన్ చేస్తుంది.
Also Read:సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్!
ఈ విషయం గమనించిన ఆర్యవర్ధన్ మీరా, అనులకు తెలియకుండానే సీసీటీవీలో రికార్డయిన రాగసుధ వీడియోని తన అనుచరుల చేతి డిలిట్ చేయిస్తాడు. ఏదో జరుగుతోందని గమనించిన అను ..జెండే ఏదో తప్పుచేస్తున్నాడని స్వయంగా ఆర్యవర్ధన్ కే చెబుతుంది. తను ఏం చేసినా తను చెప్పిందే చేస్తాడని చెబుతాడు. దీంతో తెరవెనుక పెద్ద కుట్ర జరుగుతోందని అనుకి తెలిసిపోతుంది. ఇది గమనించిన ఆర్యవర్ధన్ ఏం చేశాడు? తన అసలు రంగు బయటపెట్టాడా? .. అను రియాక్షన్ ఏంటీ? .. అను తల్లిదండ్రుల వద్ద వున్న రాగసుధ ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అన్నది తెలియాలంటే ఈ గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే.