English | Telugu
Divya Elimination: దివ్య ఎలిమినేషన్.. అంతా సిద్ధం.. బిగ్ బాస్ సతమతం!
Updated : Nov 26, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఫ్యామిలీ వీక్ ముగిసాక హౌస్ లో తొమ్మిది కంటెస్టెంట్స్ మిగిలారు. అయితే వీరిలో కెప్టెన్ రీతూ తప్ప మిగిలిన ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. ఇక హౌస్ లో భరణి, తనూజ, దివ్య వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.
గతవారం కెప్టెన్సీ రేస్ నుండి తనూజని దివ్య తప్పించడంతో తనూజ, దివ్యల మధ్య అగ్గి రాజుకుంది. అయితే తనూజ ఎప్పుడు చూసిన దివ్యని తప్పుగా అర్థం చేసుకుంటు తననే టార్గెట్ చేసి గొడవ పడతుంది. ఎందుకంటే తనూజకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది దివ్యనే. రీతూ డీమాన్ ఓ ట్రాక్ లో వెళ్తుంటే.. సంజన అమ్మగా ఇమ్మాన్యుయల్ కొడుకుగా ఓ బాండ్ నడుస్తోంది. ఇక తనూజతో పోటీగా గేమ్స్ ఆడేది దివ్య మాత్రమే. అందుకే దివ్యని మెంటల్ గా వీక్ చేయాలని తనూజ భావించి తనని పర్సనల్ గా ఎటాక్ చేసింది. నేను భరణి సర్ తో మాట్లాడినా తప్పేనా.. ఏంటి నువ్వు అన్నట్టుగా దివ్యని రెచ్చగొట్టి, తనని నోరుజారేలా చేసి, అందరి ముందు తప్పుగా పోట్రే చేసి.. తనని ఎంత బ్యాడ్ చేయాలో అంతా బ్యాడ్ చేసింది తనూజ.
ఈ సీజన్-9 విన్నర్ లేదా రన్నర్ గా తనూజని చేయాలని బిగ్ బాస్ ఆలోచిస్తున్నాడు. అందుకే తనూజకి సంబంధించిన నెగెటివ్ ఫుటేజ్ అంతా తీసేస్తున్నారు. తనూజ ఎవరితో గొడవ పెట్టుకుంటుందో వారిని బయటకు పంపించేస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగానే గతవారం దివ్యని పంపించెయ్యడానికి బిగ్ బాస్ స్కెచ్ వేయగా ఇమ్మాన్యుయల్ పవరస్త్ర వాడి అడ్డుకట్ట వేశాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ మాత్రం ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఓటింగ్ అంతా బిగ్ బాస్ చేతిలోనే కాబట్టి తనూజ, కళ్యాణ్ లకి అత్యధిక ఓటింగ్ వేసి దివ్య, డీమాన్ పవన్, భరణి లాంటి వారికి తక్కువ ఓటింగ్ పడేలా చేస్తారు. సీజన్-9 లో జెన్యున్ కంటెస్టెంట్స్ అయినటువంటి భరణి, డీమాన్ పవన్ , దివ్య నిఖిత లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతోంది. ఇప్పటికే తనూజని బిగ్ బాస్ దత్తపుత్రిక అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ వారం దివ్య ఎలిమినేషన్ అయితే మాత్రం తనూజని విన్నర్ చేయడానికి బిగ్ బాస్ ఇదంతా చేస్తున్నాడని ఆడియన్స్ అందరికి అర్థమవుతుంది.