English | Telugu
'దిల్' రాజు కుమార్తె యోగా భంగిమలు చూశారా?
Updated : Jul 16, 2021
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన 'దిల్' రాజు, ఫిట్‌నెస్‌కు ఇంపార్టెన్స్ ఇస్తారు. వయసు కనపడనివ్వరు. ఫిట్‌గా ఉంటారు. ఇప్పుడు 'దిల్' రాజు కుమార్తె హన్షితారెడ్డి కూడా ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టారు. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతున్నారు. రీసెంట్‌గా యోగా కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం హన్షితారెడ్డి బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారట.
ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత మహిళలు బరువు పెరగడం సర్వ సాధారణం. హన్షితారెడ్డి ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చారు. బాబు పేరు ఆరాన్ష్. పాప పేరు ఇషిక. అమ్మాయి పుట్టి ఏడాదిన్నర దాటింది. అందుకని, ఇప్పుడు హన్షితారెడ్డి ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టారు. ఏరియల్ యోగా చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'కింద పడతామనే భయం మనల్ని ఎగరనివ్వదు. ఆ భయాన్ని మీలోంచి తీసేయండి. ఉంచొద్దు' అని అర్థం వచ్చేలా హన్షితా పేర్కొన్నారు.