English | Telugu

లవ్ మీద ‎ఇంట్రెస్ట్ ‎లేదు ‎అంటున్న ఢీ డాన్సర్ రాజు

ఢీ 10 రాజు అంటే బుల్లితెర మీద తెలియని వాళ్ళు లేరు. ఏ సీజన్ టైటిల్ గెలుచుకున్నాడో ఆ సీజన్ తన ఇంటి పేరుగా మారిపోయింది. అలాంటి రాజు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు. "రాజుకి రాణి ఎక్కడ ఉంది. నువ్వు లవ్ లో ఉన్నావని విన్నాను" అని హోస్ట్ అడిగేసరికి. "లేదసలు రాణి వద్దు. రాణీలే వద్దు. ఒక త్రి ఇయర్స్ బ్యాక్. బ్రేకప్ అయ్యింది. అప్పటికి ఇద్దరిదీ అన్ మెచ్యూర్డ్ మైండ్. ఇక తను లేకపోతే నేను బతకలేను అన్నంత దూరం వెళ్ళిపోయాను. అంత లవ్ చేసాను. తాను పక్కన లేకపోతే నాకు ఊపిరాడనంతలా ఉండేవాడిని. మాక్సిమం తాగిన ప్రతీ ఒక్క అబ్బాయి తన అమ్మాయిని గుర్తు చేసుకునే ఉంటాడు. ఆ అమ్మాయిని గుర్తు చేసుకుని ఏడుస్తాడు పక్కా. ఐనా ఇప్పుడు ఒక్కటే డైలాగ్. మనకెందుకు లవ్వు. ముందు ఫోకస్ ఆన్ గోల్స్. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాల్సిందే. నాతో వచ్చి మంచిగా మాట్లాడితే నేను వాళ్ళతో మంచిగా మాట్లాడతా. అది నేను చేసిన తప్పు. నా వలెనే వాళ్ళు బాధపడతారు.

మనం ఒక మనిషిని బాధపెడితే వాళ్లకు కచ్చితంగా కర్మ రిటర్న్స్ అనేది ఉంటుంది. నేను బాధపెట్టాను సో నాకు తగిలింది. నేను ఢీ 10 విన్ అయ్యాక రూమ్ రెంట్ కోసం చాలా తిరిగాను. కానీ ఎక్కడికి వెళ్లినా ఎం చేస్తారు అని అడిగేవాళ్ళు..డాన్సర్ ని అని చెప్పగానే ఇల్లు అద్దెకివ్వం అనేవాళ్ళు. దాంతో నాకు కోపం వచ్చి విల్లా దగ్గరకు వెళ్లి రెంట్ ఎంతా అని అడిగా. 60 వేలు అన్నాడు. ఐనా కడతాను అన్నా. వాళ్ళు అడిగారు వీళ్ళు అదే క్వశ్చన్ వేస్తున్నారు అని అనుకున్న డాన్సర్ ని అని చెప్పా. సారీ మేము డాన్సర్స్ కి ఇవ్వము అని చెప్పారు. అంటే బయటవాళ్ళకు డాన్సర్స్ అంటే అంత చీపా" అంటూ రాజు తాను ఎదుర్కున్న కష్టాలను చెప్పుకొచ్చాడు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.