English | Telugu
"ఛాటింగ్స్‌లో రొమాన్స్ ఉంటుంది, స్టేజి మీద లేదు".. ఓపెన్ అయిన నైనిక!
Updated : Jul 22, 2021
'ఢీ' షో ప్రతిభావంతులైన, ఔత్సాహిక డాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు గొప్ప వేదికగా నిలవడం మాత్రమే కాదు, కొంతమంది ప్రేమికులకు అడ్డాగా కూడా మారుతోంది. గతంలో కంటెస్టెంట్లు ఐశ్వర్య, బాబీ ప్రేమలో పడ్డారు. మరి ఇప్పుడు ప్రేమలో ఉన్నారో లేదో తెలియదు. అలాగే, కాస్ట్యూమ్ డిజైనర్ తో పండు ప్రేమ కొనసాగుతోంది. లేటెస్ట్ 'ఢీ' సీజన్ విషయానికి వస్తే... సాయి, నైనిక ప్రేమలో పడ్డారు. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోంది. లేటెస్టుగా రిలీజైన ప్రోమోలో అది బయటపడింది.
నెక్స్ట్ వీక్, జూలై 28న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా 'ఆచార్య'లోని 'లాహే లాహే...' పాటకు నైనిక పెర్ఫామ్ చేసింది. తర్వాత సాయితో కలిసి 'సామజ వరగమన' పాటకు ఆమెతో డాన్స్ చేయించారు. బహుశా... వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని 'ఢీ' టీమ్ దగ్గర ముందే సమాచారం ఉన్నట్టు ఉంది.
డాన్స్ చేశాక... 'మీరిద్దరూ భయపడుతున్నారు. ఫ్రీగా ఉండటం లేదు' అని ప్రదీప్ అన్నాడు. 'నేను ఓకే. వాడే నెర్వస్ గా ఉన్నాడు. కాల్స్‌లో, ఛాట్స్‌లో చాలా రొమాన్స్ ఉంటుంది. ఇక్కడ లేదు' అని నైనిక చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పింది. ప్రియమణి సహా స్టేజి మీదున్న కంటెస్టెంట్లు సైతం నోరెళ్ళబెట్టి చూశారు. ఈ ఒక్క సందర్భం చాలదూ... వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పడానికి.