English | Telugu
తన పంతం కోసం వేదని వేధిస్తున్న యశోధర్
Updated : May 18, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొంత కాలంగా స్టార్ మా లో విజయవంతంగా ప్రసాం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. స్టార్ ప్లస్ లో ప్రసారం అయిన `యే హై మొహబ్బతే` ఆధారంగా ఈ సీరియల్ ని రీమేక్ చేశారు. నిరంజన్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక కీలక పాత్రల్లో నటించారు. ఇతర పాత్రలలో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, మీనాక్షి తదితరులు నటించారు.
బిజినెస్ పార్ట్నర్ దామోదర్ రావు కోరిక మేరకు ఆయన సోదరిని వసంత్ కిచ్చి వివాహం చేయాలని యష్ విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందు కోసం అప్పటికే ప్రేమలో వున్న వసంత్ - చిత్రల మధ్య జరిగిన చిన్న గొడవని ఆయుధంగా వాడుకంటూ ఇద్దరి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తాడు. ఇదే క్రమంలో దామోదర్ రావు సోదరి నిధిని వేద ఇంట్లోకి పెయింగ్ గెస్ట్ గా దించేస్తాడు యష్. అక్కడి నుంచే యష్ - వేదల మధ్య దూరం మొదలవుతుంది. గత ఎపిసోడ్ లో వసంత్ రాసిన ప్రేమలేఖ చిత్రకు కాకుండా వేదకు చేరడంతో అది యష్ తనకే రాశాడని భ్రమల్లో వున్న వేద ఆ తరువాతే అసలు విషయం తెలుసుకుంటుంది.
యష్ కడపునొప్పి అంటూ తన హాస్పిటల్ కి వచ్చిన నేపథ్యంలో వేదకు అసలు విషయం తెలుస్తుంది. అయితే వసంత్ కు చిత్రపై ప్రేమ వుంది కాబట్టే లెటర్ రాశాడని స్పష్టమైంది కాబట్టి తనకు చిత్రతో వివాహం చేయడమే కరెక్ట్ అని వాదిస్తుంది వేద. కానీ యష్ అది మాత్రం ఎట్టపరిస్థితుల్లో కుదరదని చెప్పి తన ప్రయత్నాలకు అడ్డుపడుతుంటాడు. ఇదే సమయంలో చిత్ర, వసంత్ క్లోజ్ గా వుండటాన్ని నిధి గమనిస్తుంది. ఇదేంటీ ఇంత క్లోజ్ గా వున్నారని అడిగితే వాళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అసలు నిజం చెప్పేస్తుంది. అయితే దాన్ని ఓ జోక్ గా మార్చి యష్ కవర్ చేస్తాడు. ఆ తరువాత వసంత్ ని కూడా మార్చేయడంతో వేద వేదనతో రగిలిపోతుంది. మరి బుధవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది?. నిధికి అసలు విషయం తెలుస్తుందా? .. వసంత్ మారతాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.