English | Telugu

Brahmamudi : రాహుల్ కి భాద్యతలు అప్పగించిన రాజ్.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -882 లో.. రాహుల్ కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని రాజ్ ని కావ్య రిక్వెస్ట్ చెయ్యడంతో రాజ్ సరే అంటాడు. అందరు భోజనం చేస్తుండగా రాహుల్ ని రాజ్ పిలిపించి చేతిలో ఆఫీస్ లో జాయినింగ్ లెటర్ పెడతాడు. అది చూసి మనసులో సంతోషపడుతూనే బయటకు మాత్రం ఎందుకు నాకు ఇంత పెద్ద బాధ్యత అని యాక్టింగ్ చేస్తాడు. నేను ఆఫీస్ కి ఇప్పట్లో రాను నువ్వే ఆఫీస్ చూసుకోవాలని రాజ్ చెప్తాడు. చూసావా రుద్రాణి మా రాజ్ నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు. అది మంచి విషయం కాబట్టి మేం ఏం అడ్డుపడడం లేదని ధాన్యలక్ష్మి అంటుంది.

రాజ్ నా కొడుకుపై నమ్మకంతో ఇదంతా చేస్తున్నాడు.. అదేదో నువ్వు చేసినట్లు అంటున్నావేంటని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ తను చెప్పింది చేసాడని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అనుకున్నది సాధించామంటూ రుద్రాణి, రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఆఫీస్ మొత్తం నా గుప్పిట్లో పెట్టుకొని వీళ్ళని ఎలా ఆడిస్తానో చూడు మమ్మీ అని రాహుల్ అంటాడు. రాహుల్ ఆఫీస్ కి వెళ్తాడు. తనని చూసి వీడెందుకు వస్తున్నాడని శృతి అనుకుంటుంది. ఏం శృతి షాక్ అయ్యావా.. పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్నీ పట్టుకొని క్యాబిన్ కి రా అని రాహుల్ చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏం పులిహోర కలుపుతాడోనని శృతి భయపడుతుంది.

మరొకవైపు సుభాష్, అపర్ణ కోసం రాజ్, కావ్య బట్టలు ఆర్డర్ పెడతారు. ఇప్పుడెందుకని ఇంట్లో వాళ్ళు అడుగగా.. రేపు అమ్మానాన్నల పెళ్లిరోజు అని రాజ్ చెప్తాడు. మీ పెళ్లిచూపులు ఎలా జరిగాయని రాజ్ అడుగుతాడు. అసలు పెళ్లిచూపులే జరగలేదని అపర్ణ అంటుంది. తరువాయి భాగంలో సుభాష్, అపర్ణకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.