English | Telugu
Brahmamudi : ఒంటరిగా ఉన్న అపర్ణపై ఆ ఇద్దరి మాస్టర్ ప్లాన్ అదేనా!
Updated : Sep 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -506 లో.. రాహుల్ ని విడిపించమని ఇందిరాదేవి, సీతారామయ్యల దగ్గరకి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది రుద్రాణి. రాహుల్ తప్పు చేసాడు.. అనుభవించనియ్ అన్నట్లు వాళ్ళు మాట్లాడతారు. ఈ విషయంలో మేమ్ ఏం చెయ్యాలేము.. ఎవరైనా చేస్తానన్న అడ్డుపడే వారిలో మేమ్ ముందుంటామని ఇందిరాదేవి అంటుంది. దాంతో రుద్రాణి డిస్సపాయింట్ అవుతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. వాడు చిన్న తప్పు చేసినప్పుడు మందలిస్తే ఇంతదాకా వచ్చేవాడు కాదని రాజ్ అంటాడు.
నా కొడుకు నిర్దోషి.. కోర్ట్ శిక్ష వెయ్యదని రుద్రాణి అంటుంది. కనీసం స్వప్న మొహం చూసి అయిన విడిపించమని రుద్రాణి అనగానే.. ఇప్పుడు ఏ అస్త్రం ప్రయోగిస్తున్నావంటూ అపర్ణ అక్కడికి వస్తుంది. నా కొడుకుని పోలీసులు తీసుకొని వెళ్తుంటే.. ఏం చేసావ్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడవంటూ రుద్రాణిని అపర్ణ కోప్పడుతుంది. రాజ్ ని అపర్ణ తన వెంట తీసుకొని వెళ్తుంది. దాంతో రుద్రాణి కోపంగా ఇల్లు ముక్కలు చేస్తానంటూ ఆవేశపడుతుంది. ఆ తర్వాత రుద్రాణి స్వప్న దగ్గరికి వచ్చి నీ భర్త అక్కడ స్టేషన్ లో ఉంటే.. ఏం పట్టనట్లు మంచిగా బిర్యానీ తింటున్నావని అడుగుతుంది. నువ్వు ఉన్నావ్ కాబట్టి బిర్యానీ హాఫ్ తిన్నా లేకుంటే మొత్తం నేనే తినేదాన్ని అంటూ స్వప్న అంటుంది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ పోలీసులు రాహుల్ ని తీసుకొని వస్తారు. ఏంటి ఇంటరాగేషన్ కా అని స్వప్న అంటుంది. రాహుల్ ఏ తప్పు చెయ్యలేదని తెలిసింది ఇతని పేరుతో వేరొకరు చేశారని తెలిసింది. అందుకే తీసుకొని వచ్చామని ఇన్స్పెక్టర్ అంటాడు.
ఆ తర్వాత ఇక రుద్రాణి రెచ్చిపోయి.. నిన్న నా కొడుకు తప్పు చెయ్యలేదు అంటే ఎవరు నమ్మలేదు. అందరికి రిక్వెస్ట్ చేసాను.. ఎవరు రియాక్ట్ అవ్వలేదని రుద్రాణి అందరిని తిడుతుంది. ఆ తర్వాత కర్తవ్యం విజయశాంతిలాగా ఏదో సాధించాను అనుకున్నావని కావ్యని రుద్రాణి అంటుంది. బయటకి వచ్చాడని తప్పు చెయ్యలేదనుకోకు ఎలాగైనా దీన్ని గురించి కనుక్కుంటానని కావ్య ఛాలెంజ్ చేస్తుంది. ఆపమంటు కావ్యపై రాజ్ కోప్పడతాడు. తరువాయి భాగంలో అందరు గుడికి వెళ్ళాలనుకుంటారు. నేను రాలేనని అపర్ణ అంటుంది. నేను అత్తయ్యతో ఉంటానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఇప్పుడు అత్తయ్యకి ఏదైనా అయితే అది కచ్చితంగా కావ్య మీదకి వస్తుందని రాహుల్ , రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.