English | Telugu

Brahmamudi : నా కోడలికి క్షమాపణ చెప్పి తీసుకొనిరా.. నిజమేంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -516 లో... అపర్ణ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. స్వప్న హారతి ఇవ్వడంతో నా కోడలు కావ్య ఇవ్వకుండా స్వప్న ఇస్తుంది ఏంటని అపర్ణ అనగానే.. నీ కోడలు ఎక్కడుంది. ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని రుద్రాణి అనగానే ఏంటని అపర్ణ అడుగగా.. ఏం లేదు మొక్కు తిరుచుకోవడానికి గుడికి వెళ్ళిందని రాజ్ కవర్ చేస్తాడు. అపర్ణ ఇంట్లోకి వెళ్ళగానే నోరు అదుపులో పెట్టుకోమంటు రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది.

మరొకవైపు జాబ్ కోసం ఒక దగ్గరికి వెళ్తుంది. డిజైన్స్ వేస్తానని కావ్య అంటుంది. ఇది వరకు అలాగే చేసావ్.. మళ్ళీ నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపోతే డిజైన్స్ ఎవరు వేస్తారని అతను అనగానే ఇప్పుడు అలా జరగదు మీకు డిజైన్స్ వేస్తానని కావ్య అంటుంది. సరే ఫోన్ చేస్తానని అతను అంటాడు. ఆ తర్వాత రాజ్ అపర్ణకి టాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. కావ్య ఎక్కడికి వెళ్ళిందంటే మాట దాటవేస్తున్నావ్ ఏంటని అపర్ణ అడుగుతుంది. అప్పుడు కూడా రాజ్ డైవర్ట్ చేసి వెళ్ళిపోతాడు. ధాన్యలక్ష్మిని కూడా అపర్ణ అడుగుతుంది. తను కూడా డైవర్ట్ చేస్తుంది. ఇందిరాదేవి వస్తుంది. నేను లేనప్పుడు ఏదైనా జరిగిందా అని అపర్ణ అడుగుతుంది. ఏం జరగలేదని ఇందిరాదేవి చెప్తుంది. ఆ తర్వాత ఇంత రాత్రి అయింది.. కావ్య ఇంకా ఇంటికి రాలేదని అపర్ణ రాజ్ ని అడుగుతుంది. అసలేం జరిగింది కావ్యని ఇంట్లో నుండి పంపించేసారా అని అడుగుతుంది. ఈ రుద్రాణి వళ్లే నా కోడలు ఇంట్లో నుండి వెళ్లిపోయిందా అని అపర్ణ అనగానే.. నా వల్ల కాదు మీ కొడుకు వల్లే వెళ్ళిపోయింది. తను చేసిన తప్పు బయటపడేసరికి వెళ్ళిపోయిందని రుద్రాణి అంటుంది.

ఆ తర్వాత నా చెల్లి ఏ తప్పు చేసిందంటూ స్వప్న జరిగిందంతా అపర్ణకి చెప్తుంది. మీ కొడుకు మా అత్త మాటలకి రెచ్చిపోయి తన మనసు విరిచేసాడు. అందరికోసం బలవంతంగా కాపురం చేసాడట.. ఇక నా భర్త మనసులో స్థానం లేనప్పుడు, నేను ఇంకా ఎందుకని ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని స్వప్న చెప్పగానే.. అపర్ణ షాక్ అవుతుంది. తరువాయి భాగంలో నా కోడలికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని రా అని రాజ్ కి అపర్ణ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...