English | Telugu
బిందుని అంతగా ఇరిటేట్ చేశాడా?
Updated : May 23, 2022
పక్కా గేమ్ ప్లాన్‌తో బిగ్ బాస్ నాన్ స్టాప్ బరిలోకి దిగిన బిందు బాధవి ఫైనల్‌గా తన గేమ్ ప్లాన్‌తో టైటిల్‌ని సొంతం చేసుకని విజేతగా నిలిచింది. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఎవరి ముందు తగ్గడానికి ఇష్టపడని యాటిట్యూడ్‌తో తనని టార్చర్ చేయాలనుకున్న వాళ్లకే చుక్కలు చూపిస్తూ ముందుకు సాగింది. ఎవరు ఎలా అనుకున్నా ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా తనదైన గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కప్పుని ఎగరేసుకుపోయింది. ఇంత వరకు ఫిమేల్ కంటెస్టెంట్లకు దక్కని కప్‌ని, విక్టరీని దక్కించుకుని బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన ఫస్ట్ ఫిమేల్ గా రికార్డు సాధించింది.
`మస్తీ` హ్యాష్ ట్యాగ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బిందు ఆ తరువాత ఆడపులిగా మారి సెట్టింట హల్ చల్ చేసింది. తాజాగా టైటిల్ విన్నర్ అయిన తరువాత యాంకర్ రవి హోస్ట్ గా వ్యవహరిస్తున్న `బిగ్ బాస్ బజ్` కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రవి అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. `బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవడం నా తొలి విజయంగా భావిస్తున్నా. విన్నింగ్ స్టార్టయింది. ఇక నుంచి విజయవంతంగా ముందుకు సాగుతానని అనుకుంటున్నా` అని బిందు చెప్పుకొచ్చింది.
అయితే 'బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యావు కానీ ఒక్కసారి కూడా ఎందుకు కెప్టెన్ కాలేకపోయావ్?' అని యాంకర్ రవి అడిగితే ఎందుకో తనకు తెలియదని సిగ్గుల మొగ్గయింది. ఇక 'హౌస్‌లో మోస్ట్ ఇరిటేటింట్ కంటెస్టెంట్ ఎవరు?' అని అడిగితే, 'నటరాజ్ మాస్టర్' అంటూ టక్కున చెప్పేసింది. అంటే తనని అంతలా నటరాజ్ మాస్టర్ ఇరిటేట్ చేయాడన్నమాట. సీజన్ ఎండింగ్ లో నటరాజ్ మాస్టర్ .. బిందుని శూర్పణఖ అని, నీ ముక్కు చెవులు కోసేస్తానని చెప్పడం తెలిసిందే. అదే బిందుని ఇరిటేట్ చేసిందని తెలుస్తోంది. ఇదిలా వుంటే బిగ్ బాస్ విన్నర్ గా బిందు బాధవికి ప్రైజ్ మనీ కింద రూ. 40 లక్షలు దక్కింది.