English | Telugu

మొదటివారం నామినేషన్ లో ఎవరున్నారంటే!

బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. హౌస్ మేట్స్ మధ్య సాగిన హీటెడ్ కంటెస్టెంట్స్ మధ్య అరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. వాళ్ళెవరో ఓసారి చూసేద్దాం..

సోనియా నామినేషన్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా మారింది. సోనియా మాట్లాడితే అవతలి వాళ్ళు సరిగ్గా డిఫెండ్ చేయలేకపపోతున్నారు. ఇక కిర్రాక్ సీత హౌస్ లో ఏం జరిగిందని వ్యాలిడ్ పాయింట్లతో నామినేట్ చేసింది. అలాగే అభయ్ నవీన్ కూడా హౌస్ లో ఎలా ఉండాలి.. పర్సనల్ విషయాలు ఇక్కడ అంత అవసరం లేదంటు చెప్పడంతో హౌస్ మేట్స్ క్లాప్స్ కొట్టారు. మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు. లాంచింగ్ ఎపిసోడ్ అయిన రోజు తనలో ఫెమినిటీ ఉందంటూ విష్ణుప్రియ చెప్పడం తనకి నచ్చలేదని.. దాని వల్ల తనని బయట అందరూ ట్రోల్ చేసే అవకాశం ఉందంటూ మణికంఠ చెప్పాడు. ఇక ఈ విషయంలో విష్ణుప్రియ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నిన్ను చెక్ చేయడానికే ఈ థ్రీ డేస్ నీతో క్లోజ్‌గా ఉన్నానంటూ మణికంఠ తన అసలు రంగు బయటపెట్టాడు. "నువ్వు జెన్యూన్ అనుకున్నా కానీ నువ్వు నన్ను చెక్ చేయడానికి వచ్చావ్.. నేను నిన్ను చాలా నమ్మాను " అంటు విష్ణుప్రియ ఏడ్చింది. ఇక తర్వాత తన రెండో నామినేషన్ శేఖర్ బాషాకి వేశాడు మణికంఠ. వీళ్లిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే ఎవడికి లేదయ్యా ఫ్లాష్ బ్యాక్.. ఓ వచ్చి ఏడ్చేసి.. దాన్ని నుంచి సింపథీ తెచ్చేసుకొని.. పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావంటు శేఖర్ బాషా ఫైర్ అయ్యాడు. ఇక వీరిద్దరిలో శేఖర్ బాషాను సేవ్ చేసి విష్ణును నామినేట్ చేసింది యష్మీ.

ఆ తర్వాత పృథ్వీ తన నామినేషన్ ప్రక్రియని మొదలెట్టాడు. బేబక్కను మొదటిగా నామినేట్ చేయగా తర్వాత మణికంఠను నామినేట్ చేశాడు. నాకు పిరికివాళ్లు నచ్చరు.. దేనికైనా ఇలా ఏడ్చే వాళ్లు అసలే నచ్చరు.. నువ్వు సింపథీ గేమ్ ఆడుతున్నావ్.. నువ్వు ఓ నెగెటివ్ పర్సన్ అంటు పృథ్వీ నామినేట్ చేశాడు. ఇక వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది నైనిక. ఇక హౌసగ లో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సోనియా, బేబక్క, ,శేఖర్ బాషా, విష్ణు ప్రియ, పృథ్వీ, మణికంఠ మొత్తంగా ఈ వారం ఆరుగురు నామినేషన్లో ఉన్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...