English | Telugu

Bigg boss 9: నాగచైతన్య కోసం నేను రెడీ అంటూ రీతూ బోల్డ్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్-9 ఇప్పటికే పది వారాలు కంప్లీట్ చేసుకుంది. ‌ఇక పదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అందులో శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున తన కొడుకు నాగ చైతన్య(Nagachaitanya)ని తీసుకొచ్చాడు. దాంతో హౌస్ అంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక హౌస్ మేట్స్ తో పాటు రీతూ చౌదరి కూడా ఆనందం ఆపులోకపోయింది. దాంతో తను మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.

నాగ చైతన్య స్టేజ్ మీదకి రాగానే నాగార్జున సర్ ప్రైజ్ ఫీల్ అయ్యాడు. ఇక నాగ చైతన్య తన గురించి చెప్పుకొచ్చాడు. నాకు యాక్టింగ్తో పాటు రేసింగ్ అంటే బాగా ఇష్టమని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. అందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమికి నేనే ఓనర్ ని‌‌ నేను అంటూ నాగచైతన్య చెప్పడంతో నాగార్జున హ్యాపీగా ఫీల్ అయ్యాడు.


నాకు తెలియకుండా ఎప్పుడు చేశావని అడగ్గా.. చేశానులే అని అన్నాడు చైతూ. ఇక తర్వాత హౌస్ మేట్స్ అందరికీ పరిచయం చేశారు. అందరు ఒకటి చెప్తే రీతూ మాత్రం ఒక్క ఆకు ఎక్కువే చదివింది. మీరంటే నాకు పిచ్చి అని చెప్పింది. దాంతో హౌస్ అంతా షాక్‌. అదేంటమ్మా నేనంటే ఇష్టమని అన్నావుగా అని నాగార్జున అనడంతో.. ఎప్పటికీ మీరు మీరే సర్ అని చెప్పింది. చైతూలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పమని నాగార్జున అడుగగా.. చైతూ సర్ కాళ్లు ఉంటాయ్ సర్.. ఎంత తెల్లగా ఉంటాయో.. శిల్పాన్ని చెక్కినట్లుగా ఉంటారని రీతూ చెప్పడంతో.. ఆ శిల్పాన్ని చెక్కింది నేనే అంటూ నాగార్జున చెప్పాడు.

నువ్వు ఇప్పుడు బయటకు వస్తే చైతూ నిన్ను బైక్ మీద తీసుకుని వెళ్తాడని నాగార్జున(Nagarjuna)అన్నాడు.


రీతూ వెంటనే వచ్చేస్తానని అంది. ఆయన కోసం ఎలిమినేట్ అయి ఇంట్లోంచి బయటకు వచ్చేయడానికి సైతం ఓకే అని చెప్పేసింది. నువ్వు గెలిచిన తర్వాత కూడా నిన్ను బైక్ మీద తీసుకెళ్తా అని నాగ చైతన్య అనడంతో రీతూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. నాగ చైతన్య గురించి రీతూ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారాయి. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. మరీ ఇంత పొగడాలా‌‌.. ఎంత స్క్రిప్ట్ అయితే మాత్రం ఇంతలా దిగజారాలా అంటు రీతూపై నెటిజన్లు ట్రోల్ చేస్తారు.