English | Telugu
మారని నటరాజ్ మాస్టర్.. రవి దగ్గర కూడా అదే తీరు!
Updated : May 17, 2022
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది. టైటిల్ ను గెలిచేందుకు హౌస్‌మేట్స్ గట్టి పోటీ పడుతున్నారు. ఇక గత వారం హౌస్‌మేట్స్ అంతా నామినేషన్స్ లో వున్నారు. బిందు మాధవి, అఖిల్, బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్, అరియానా, మిత్ర, అనిల్, యాంకర్ శివ నామినేషన్స్ లో వున్నారు. అయితే వీళ్లలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. తక్కువ ఓట్ల కారణంగా తను హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ బజ్ లో యాంకర్ రవితో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. అయితే ఇక్కడ కూడా హౌస్‌లో ప్రదర్శించిన పంధాని కొనసాగించడం గమనార్హం.
దీనికి సంబంధించిన తాజా ప్రోమోని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విడుదల చేసింది. ఎంట్రీ ఇస్తూనే 'నా రాక కోసమే ఎదురుచూస్తున్నట్టున్నావ్' అంటూ రవికి కౌంటర్ వేశాడు నటరాజ్ మాస్టర్. అయితే రవి కూడా వెంటనే నటరాజ్ కు కౌంటర్ ఇచ్చాడు. 'మీ కోసం ఎదురుచూస్తోంది నేను ఒక్కడినే అనుకుంటే మీ పొరపాటు' అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే బిగ్ బాస్ హౌస్ నుంచి, నాన్ స్టాప్ హౌస్ నుంచి ఒకరి వల్లే బయటికి వచ్చానని అనడంతో 'అంత నెగెటివిటి ఎందుకు?' అంటూ క్లాస్ పీకాడు రవి. 'చెన్నై తమిళ్..' అంటూ మళ్లీ నటరాజ్ అందుకోవడం.. తనకు సక్సెస్ అందుకే రాలేదనడంతో 'ఇక్కడ టాలెంట్.. టాలెంట్ కు బౌండరీస్ లేవు' అన్నాడు రవి.
'నువ్వు ఏదో లోపల పెట్టుకుని పాయింట్స్ రాసుకుని నా మీద అటాక్ చేస్తున్నావ్. ప్రతి పాయింట్ అర్థమవుతుంది' అని రవిపై ఫైర్ అయ్యాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య సంభాషణ కాస్త ఘూటుగానే సాగింది. 'నేను కాబట్టి కంట్రోల్ గా మాట్లాడుతున్నాను. బయటకి వెళ్లి చూడండి.. మీ మీద ఎలా వుందో అర్థమవుతుంది' అని రవి అనడంతో నటరాజ్ మాస్టర్ లో సౌండ్ లేదు. ఇక ఈ ఇంటర్వ్యూలో యాంకర్ రవి.. నటరాజ్ మాస్టర్ ని ఎలా ఆడుకున్నాడు? .. ఇద్దరి మధ్య జరిగిన రచ్చ ఏంటీ అన్నది తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.