English | Telugu

Bigg Boss 9 Telugu: తనూజ విన్.. ఆడపులి కాదు ఆడపిల్లిలా రీతూ!

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి, దివ్య రెబల్స్ గా తమకు ఇచ్చిన రెండు టాస్క్ లు పూర్తి చేసి కళ్యాణ్, నిఖిల్ లని కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ నుండి తొలగించారు.

ఇక ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్లు లేవని రీతూ తెలుసుకోగా.. దివ్య షాక్ అయింది.‌ ఇక తను అందరిని అడిగింది. రీతూ వాటర్ బాటిల్స్ చెక్ చేసింది. అదే సమయంలో దివ్య తెలివిగా రీతూని డైవర్ట్ చేయడానికి గౌరవ్ తో గొడవపెట్టుకుంది. దాంతో రీతూ, గౌరవ్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అదే 'టచ్ ఇట్ స్మెల్ ఇట్ గెస్ ఇట్'. దీనికి సంజన సంచాలకులు. దీని కోసం యాక్టివిటీ ఏరియాలో ఘోస్ట్ రూమ్‌ టైప్‌లో చీకటి గదిని ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. దీనిప్రకారం ఆ గదిలో ఐదు ఐటెమ్స్ ఉంటాయి. చీకటిలో వాటిని టచ్ చేసి, స్మెల్ చేసి, గెస్ చేసి అవేంటో కరెక్ట్‌గా చెప్పాలి. ఎవరు ఎక్కువ కరెక్ట్ చెబితే ఆ టీమ్ విన్ అవుతుంది. ఇక ఏం పెట్టారో చెక్ చేద్దామని వచ్చిన సంజన.. అక్కడున్న దెయ్యం వేషాలు చూసి బొమ్మలనుకుంది. కానీ వాళ్లు కదిలేసరికి సంజన కూడా ఉలిక్కిపడింది. ఇక ముందుగా ఆరెంజ్ టీమ్ నుంచి తనూజ ఆడటానికి వచ్చింది. రూమ్‌లోకి ఎంటర్ కాగానే తనూజ ఏడుపు మొదలెట్టింది. నాకు చీకటంటే భయం ప్లీజ్ అంటూ ముందుకెళ్లింది. టీవీలో చూస్తున్న సంజనని.. పాత పగలన్నీ తీర్చుకుంటున్నారా ఏంటి.. ఎక్కడ ఏం ఉన్నాయో తెలీడం లేదంటూ తనూజ భయపడింది. ఇక సంజన తనకి క్లూ ఇచ్చింది. అందులో అయిదు వస్తువుల్లో నాలుగింటికి కరెక్ట్ గెస్ చేసింది తనూజ. ఇక ఆరెంజ్ టీమ్ నుండి దివ్య ఆడటానికి వచ్చింది. తను మూడు వస్తువులు కరెక్ట్ గా గెస్ చేసింది.

కాసేపటికి బ్లూ టీమ్ నుండి రీతూ వెళ్ళింది. అయితే వెళ్లేముందు సంజనతో అటిట్యూడ్ చూపించింది. పులి ఆడపులీ అంటూ జుట్టుని ఎగరేస్తూ వెళ్ళింది రీతూ. డెవిల్ హౌస్‌లోకి వెళ్లిన తరువాత.. రీతూ చౌదరితో దెయ్యాలు కాసేపు ఆడుకున్నాయి. ఆడపులి కాస్తా పిల్లి అయిపోయింది. నేను బయటకు పోతా ఇట్లా చేయకండి ప్లీజ్ అంటూ రీతు రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత తను కూడా అయిదు వస్తువుల్లో మూడు వస్తువులని కరెక్ట్ గా గెస్ చేసింది. ఇక ఆ రౌండ్ లో తనూజ ఎక్కువ వస్తువులు గెస్ చేయడంతో తనూజ టీమ్ విన్ అయ్యింది. ఇక వారికి రెబల్స్ తీసే ఎలిమినేషన్ నుండి సేవింగ్ పొందుతారు. ఎవరికి ఆ సేవింగ్ కార్డ్ లభిస్తుందో చూడాలి మరి. నిన్నటి గోస్ట్ టాస్క్ లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారో కామెంట్ చేయండి.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.