English | Telugu
Sanjana family week: బిగ్ బాస్ సీజన్-9 లో సంజన ఫ్యామిలీ వస్తుందా!
Updated : Nov 19, 2025
బిగ్‌బాస్ సీజన్-9లో ఫ్యామిలీ వీక్ మొదలైపోయింది. అయితే అందరి చూపు సంజన ఫ్యామిలీ మీదే ఉంది. అసలు సంజన ఫ్యామిలీ వస్తుందా.. తన పిల్లల్ని చూసుకునే ఛాన్స్ బిగ్‌బాస్ ఇస్తారా అంటూ ఆడియన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే సంజన ఫ్యామిలీ వీక్ ఉండటం కన్ఫమ్ కానీ దానికి ఇంకా కాస్త టైమ్ ఉంది.
నిన్నటి ఎపిసోడ్ లో తనూజ వాళ్ళ అక్క పాప, అనూజ వచ్చారు. అలాగే సుమన్ శెట్టి వాళ్ళ భార్య వచ్చారు. అయితే సంజనకి మాత్రం ఇప్పుడే ఫ్యామిలీని పంపించరు ఎందుకంటే సంజనని ఇంకా కొంచెం ఏడిపించి బిగ్ బాస్ సీజన్-9 టీఆర్పీ చూసుకొని, చివరికి హౌస్‌మేట్స్ కొందరితో ఏదైనా త్యాగాలు చేయించి ఆ ఛాన్స్ ఇస్తారనుకుంట. అయిదు నెలల చిన్నబాబుని ఇంట్లో వదిలేసి సంజన బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. నిజానికి ఇది గొప్ప విషయం ఎందుకంటే ఆ సమయంలో తన బాబు దగ్గర ఉండాలని ప్రతీ తల్లి అనుకుంటుంది. అమ్మ స్పర్శని బిడ్డ ఎంతగా కోరుకుంటుందో అందరికి తెలుసు. కానీ సంజన మాత్రం బిగ్‌బాస్ హౌస్‌లోకి రావాలని నిర్ణయించుకొని తన దృష్టిలో పెద్ద త్యాగమే చేసింది.
అయితే ఇటీవల తన భర్త వీడియో మెసేజ్‌ని సంజనకి చూపించారు. ఆ సమయంలో సంజన ఇద్దరు పిల్లలు అందులో కనిపించారు. ముఖ్యంగా తన చిన్న బాబుని చూసి సంజనకి కన్నీళ్లు ఆగలేదు. తన కొడుకు అయితే అమ్మ మీద అలిగి సంజనతో సరిగా మాట్లాడలేదు. అప్పుడే సంజన చాలా ఏడ్చేసింది. పోనిలే ఫ్యామిలీ వీక్‌లో తన పిల్లల్ని, భర్తని చూసుకోవచ్చని సంజన అనుకుంది. కానీ గతవారం సండే ఎపిసోడ్ లో బిగ్ బాంబ్ పేరుతో తనకి నో ఫ్యామిలీ వీక్ అని నాగార్జున చెప్పాడు.
నిన్నటి ఎపిసోడ్ లో తనూజ వాళ్ళ అక్క పాపని చూడగానే సంజన ప్రేమతో మురిసిపోయింది. తన కూతుర్ని ఎత్తుకున్నట్లే ఫీలై దగ్గరికి తీసుకొని తనతో ఆడుకొని ముద్దు పెట్టి అల్లాడిపోయింది. అది చూసి బిగ్ బాస్ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. సంజనకి ఫ్యామిలీ వీక్ ఉంటుందా? ఉండదా మరి ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.