English | Telugu

Bigg Boss 9 Telugu: కెప్టెన్సీ రేస్ నుండి నిఖిల్, డీమాన్ పవన్ అవుట్!

బిగ్ బాస్ సీజన్-9 లో తొమ్మిదో వారం క్రేజిగా సాగుతోంది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా మంగళవారం నుండి కెప్టెన్సీ కంటెండర్స్ రేస్ కి సంబంధించిన టాస్క్ లు ఇవ్వడం మొదలెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ఓ ఫోన్ ని గార్డెన్ ఏరియాలో ఉంచి కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ వారికి సీక్రెట్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్.

సుమన్ శెట్టి, దివ్య ఇద్దరు రెబల్స్ అవ్వడంతో తమకి వచ్చిన రెండో సీక్రెట్ టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేశారు. దాంతో దివ్యకి బిగ్ బాస్ కాల్ చేశాడు. హౌస్ లో ఎవరిని కెప్టెన్సీ రేస్ నుండి తీద్దామని అనుకుంటారంటూ అడిగాడు. ఎవరిని ఆయితే తీసేద్దామనుకుంటున్నారో జైలు దగ్గరున్న కెమెరాకి చెప్పండి అని బిగ్ బాస్ అనగా.. నిఖిల్ పేరుని చెప్పారు సుమన్ శెట్టి, దివ్య. ఆ తర్వాత అదే విషయం లేఖ ద్వారా పంపించాడు బిగ్ బాస్.

ఇక కాసేపటికి కంటెస్టెంట్స్ అందరిని సోఫాలో కూర్చోమన్నాడు బిగ్ బాస్ చెప్పగా.. మరో లేఖ వచ్చింది. అందులో ఏం ఉందంటే.. ఇప్పటివరకూ జరిగిన ఆటని మీరు గమనించి ఉంటారు.. గనుక మీ దృష్టిలో ఎవరు రెబల్ అనేది మీరు ఒక్కొక్కరూ చెప్పాలి.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పుకుంటారు అని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఎక్కువమంది డీమాన్ రెబల్ అని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత సాయి పేరు చెప్పారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా దివ్య, సుమన్ పేరు చెప్పలేదు. దీంతో మీరందరూ అనుకున్నట్లు పవన్ రెబల్ కాదు. మీరు తప్పుగా అనుకున్నారు.. అయినా ఎక్కువమంది పవన్ పేరు చెప్పడంతో తను రేసు నుంచి తప్పుకున్నాడని బిగ్‌బాస్ చెప్పాడు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.