English | Telugu

Bigg Boss 9 Telugu 12th week Voting: పన్నెండో వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండో వారం ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. అయితే ఈ వారం నామినేషన్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్ పడాల, దివ్య నిఖిత, సంజన గల్రానీ, డీమాన్ పవన్, భరణి ఉన్నారు. ఇక వీరిలో ఎవరికి ఎంత ఓటింగ్ పడిందో ఓసారి చూసేద్దాం.

ఇమ్మాన్యుయల్ చాలా వారాల తర్వాత నామినేషన్ లోకి వచ్చాడు. అయినప్పటికి ఓటింగ్ భారీగానే పడుతుంది. ఇక ఎప్పటిలాగే కళ్యాణ్ పడాలకి అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. ముప్పై మూడు శాతం ఓటింగ్ తో కళ్యాణ్ మొదటి స్థానంలో ఉండగా, ఇరవై అయిదు శాతం ఓటింగ్ తో భరణి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇమ్మాన్యుయల్ పద్నాలుగో శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో ఉన్నాడు. డీమాన్ పవన్ కి తొమ్మిది శాతం ఓటింగ్ పడింది. సంజన గల్రానీ, దివ్య నిఖిత ఇద్దరు ఎనిమిది శాతం ఓటింగ్ తో లీస్ట్ లో ఉన్నారు.

డీమాన్ పవన్, సంజనా గల్రానీ, దివ్య నిఖిత ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేషన్ అయి బయటకు వస్తారో తెలియదు. ఎందుకంటే అన్ అఫీషియల్ ఓటింగ్ తో పాటు మిస్డ్ కాల్స్ కూడా లెక్కలోకి వస్తాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన పదకొండు వారాల ఎలిమినేషన్ ప్రాసెస్ లో అన్ అఫీషియల్ ఓటింగ్ లో ఎవరు డేంజర్ జోన్ లో ఉంటారో వారిలో నుండి ఒకరు ఎలిమినేట్ అయ్యేవారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందా లేక బిగ్ బాస్ మామ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా చూడాలి మరి. అయితే డేంజర్ జోన్ లో ఉన్నవారిలో డీమాన్ పవన్, దివ్య నిఖిత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. డీమాన్ కి కండబలం ఉంటే దివ్య నిఖితకి బుద్ధి బలం ఉంది. కానీ సంజనకి అవేం లేవు.. అయినప్పటికి బిగ్ బాస్ తనకి ఫేవరెటిజం చూపిస్తున్నాడు. తను అసలు గేమ్స్ ఆడకపోయినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోయినా.. అసలు తనేం చేయకపోయినా పన్నెండు వారాలు హౌస్ లో ఉందంటే అది బిగ్ బాస్ మామ సపోర్ట్ వల్లే. ఈ వారం కూడా సంజనా గల్రానీకి బిగ్ బాస్ ఫేవరెటిజం చూపిస్తాడా లేక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటకు పంపిస్తాడా చూడాలి మరి.