English | Telugu
Bigg Boss 9 Telugu 12th week Voting: పన్నెండో వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!
Updated : Nov 19, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. ఇందులో ఈసారి ఇమ్మాన్యుయల్ నామినేషన్ లో ఉన్నాడు. కెప్టెన్ అయిన కారణంగా తనూజ నామినేషన్ లో లేదు. అలాగే తనకున్న పవర్ తో రీతూని సేవ్ చేసింది తనూజ.
ఇక నామినేషన్ లో ఉన్నవారిలో కళ్యాణ్ పడాలకి అత్యధికంగా 34.44 శాతం ఓటింగ్ పడింది. ఇమ్మాన్యుయేల్ దాదాపు మూడు వారాల గ్యాప్ తర్వాత నామినేషన్స్‌లోకి వచ్చినా తనకి 23.55 శాతం ఓటింగ్ పడి రెండో స్థానంలో ఉన్నాడు. గత పదివారాల్లో మూడుసార్లు కెప్టెన్, ఇమ్మ్యూనిటీ పవర్ వల్ల సేఫ్‌గా ఉన్న ఇమ్మాన్యుయల్ ఇప్పుడు కూడా అత్యధిక ఓటింగ్ తో ఉన్నాడు. ఇక భరణి 16.61 శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో ఉన్నాడు. భరణి తన ఆటని మెరుగుపరుచుకున్నాడని ఈ ఓటింగ్ బట్టి తెలుస్తోంది. కళ్యాణ్, భరణి, సుమన్ శెట్టి మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
డీమాన్ పవన్ 11.14 శాతం ఓటింగ్ తో నాలుగవ స్థానంలో ఉన్నాడు. దివ్య 7.84 శాతం ఓటింగ్ తో అయిదవ స్థానంలో ఉన్నారు. సంజన 6.41 శాతం ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ ప్రకారం వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి వరకు ఓటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఫలితాలు మారే ఆస్కారం ఉంది. మరోవైపు బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది. ఈ వారం ఎలిమినేషన్ నిజంగా జరిగితే డేంజర్ జోన్‌లో ఉన్న దివ్య, సంజన, డీమాన్ పవన్ లో ఎవరైనా బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ డీమాన్ బయటకు వెళ్తే రీతూ - డీమాన్ ల లవ్ ట్రాక్ గండిపడాల్సిందే. మరి సంజనని ఎలిమినేట్ చేస్తారా లేక తనకి ఫేవరెటిజం చూపిస్తారా లేక దివ్యని బలిపశువుని చేస్తారా అని ఆడియన్స్ భావిస్తున్నారు.