English | Telugu
పెళ్లికి సిద్ధమైన యష్ - వేదలకు బిగ్ షాక్
Updated : Jan 27, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సరికొత్త సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ `స్టార్ మా` లో మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటోంది. మేకింగ్ పరంగానూ మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ సీరియల్ ఈ గురువారం వీక్షకులకు సరికొత్త ట్విస్ట్ ని అందించబోతోంది. గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read: బర్త్ డే స్పెషల్: రవితేజకి గోల్డెన్ ఇయర్ అదే!
ఖుషీ తనకు దక్కాలంటే వేదని పెళ్లి చేసుకోవడమే ఏకైక మార్గమని గ్రహించిన యష్ తన తండ్రి, తన సోదరుడు చెప్పిన మాటలకు ఆలోచనలో పడతాడు. మొత్తానికి ఖుషీ కోసం వేదని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యష్ అదే విషయాన్ని తనతో చెప్పడానికి ఇద్దరం ఒక చోట కలవాలని వేదకు మెసేజ్ చేస్తాడు. ఇదే విషయమై ఆలోచిస్తున్న వేద కూడా యష్ మెసేజ్ కి ఓకే చెబుతుంది. ఆ తరువాత ఇద్దరు ఓ ప్రత్యేకమైన చోట కలుస్తారు.
Also Read:చింతామణి నాటకాన్ని నిషేధించడం ఖచ్చితంగా తప్పే!
అక్కడికి వచ్చాక ఇద్దరూ ఖుషీ గురించి మాట్లాడుకుంటారు. తనకు ఖుషీ దక్కేలా చేయమని, కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని వేదని అడుగుతాడు యష్ .. కానీ వేద మాత్రం కోర్టులు తల్లికే సపోర్ట్ చేస్తాయని, ఖుషీని మాళవికకే అప్పగిస్తాయని చెబుతుంది. అయితే నాకు ఖుషీ దక్కాలంటే తనని ప్రేమించే అమ్మా కావాలని, తనని నేనిస్తానని, అది నువ్వే కావాలని చెప్పి వేదకు షాకిస్తాడు యష్. కానీ ఖుషీ కోసం ఓ తండ్రిగా నువ్వు ఏం చేశావని వేద నిలదీస్తుంది. అందుకు బాధపడిన యష్.. తనని మోసం చేసిన భార్య ముందు గెలవాలన్న తపన తప్ప నాకు ఖుషీ కనిపించలేదని, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానని బాధపడతాడు.
Also Read:యాక్షన్ తో మొదలుపెట్టనున్న బాలయ్య!?
ఇక ఫైనల్ గా తనకు ఖుషీ కావాలని, అందుకు నువ్వు సహకరించాలని వేదని అడుగుతాడు యష్.. అంతే కాకుండా తనను పెళ్లి చేసుకుంటానని, ఇందుకు అంగీకరించమని, మన పెద్దలు కూడా ఇదే కోరుకుంటున్నారని గుర్తు చేస్తాడు. ఖుషీ కోసం నేను పెళ్లికి సిద్ధమని చెబుతుంది వేద. కానీ ఓ కండీషన్ నీకు భార్యగా మాత్రం కాదని, కేవలం ఖుషీకి తల్లిగా మాత్రమే వుంటానని చెబుతుంది.
ఇందుకు యష్ కూడా తనకు బార్య అవసరం లేదని ఖుషీకి తల్లి మాత్రమే కావాలని అంటాడు. ఫైనల్ గా ఇద్దరు ఓ అంగీకరానికి వస్తారు. అయితే వీరి పెళ్లికి బిగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. తండ్రులు అంగీకరించినా యష్ - వేదల పెళ్లికి అడ్డుగా నిలిచింది ఎవరు? .. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ గురువారం ఎపిసోడ్ చూడాల్సిందే.