English | Telugu

భోలే షావలికి నూకరాజుకు మధ్య బిగ్ ఫైట్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో భోలే షావలికి నూకరాజుకు మధ్య బిగ్ ఫైట్ అయ్యింది. ఐతే షో పేరుతో ఒక అందమైన కేక్ ని తీసుకొచ్చి అందులో ఒక గోల్డ్ రింగ్ ని పెట్టారు అని రష్మీ చెప్పింది. ఐతే ఆ కేక్ ని పీసెస్ గా కట్ చేసి అందరికీ పంచింది. ఆ రింగ్ ఎవరికీ వస్తే వాళ్ళు లక్కీ అని చెప్పింది. నూకరాజుకు బోలీ షావలిని చూస్తే ఏమనిపించిందో కానీ బాగా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయి కేక్ పీస్ నోట్లో పెట్టకుండా అతని ముఖానికి పూసేసాడు.

దాంతో భోలే ఫుల్ ఫైర్ అయ్యాడు. కరెక్ట్ కాదు కదా ఇలా చేయడం. "ఏంటిది ఇలా ముఖానికి కేక్ పూస్తావా" అని సీరియస్ గా అడిగాడు. "అది చాలా చిన్న విషయం..నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావ్" అంటూ నూకరాజు భోలేని రివర్స్ లో మళ్ళీ ఏడిపించాడు. దాంతో అక్కడ సీన్ కాస్తా ఇంకా హాట్ అయ్యింది. ఇక ఈ వారం జానపద పాటల స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. అలాగే యూట్యూబ్ లో ఫేమస్ ఐనా అవుతున్న వాళ్ళను తీసుకొచ్చారు. ఇక భోలే ఐతే "భోలే అంటే హీరో..హీరో అంటే భోలే" అనే సాంగ్ పాడి అందరినీ అలరించాడు. ఐతే నెటిజన్స్ మాత్రం అటు భోలేని ఇటు నూకరాజును తిడుతున్నారు. ఇదంతా హిప్ కోసం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...