English | Telugu
ఫుడ్ డెలివరీ గర్ల్ పల్లవితో ....బేబక్క
Updated : Sep 17, 2024
బేబక్క ఒక అమ్మాయిని చూసి ఎక్సైట్ అయ్యింది. ఇంతకు ఎవరా అమ్మాయి..ఏమా కథా అంటారా..బేబక్క అంటే ఇప్పుడు ఊరు వాడా అంతా ఫేమస్ ఐపోయింది. ఆమె ఎన్ని మూవీస్ లో చేసినా ఎంతగా యాంకరింగ్ చేసినా ఎన్ని రీల్స్ చేసినా రానంత ఫేమ్ ఒక్క వారం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చేసరికి పిచ్చ ఫేమస్ ఐపోయింది. ఐతే ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసింది బేబక్క. విషయమేంటయా అంటే బేబక్క ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఫుడ్ డెలివరీ చేయడం చూసిందట. ఇంకేముంది ...చాలా ఆనందపడిపోయింది.
"హే అమ్మాయిని డెలివరీ చేస్తోంది. ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి ఫుడ్ డెలివరీ చేయడం చూస్తున్నాను. నేను ఇప్పుడు నిన్ను ఫేమస్ చేస్తా చూడు అంటూ ఫుడ్ డెలివరీ గర్ల్ పల్లవితో ఒక రీల్ చేసింది. మేక్ సం నాయిస్ ఫర్ గర్ల్ పవర్" అంటూ చెప్పింది. ఐతే అందులో ఒక మాట మాత్రం ఫుల్ కామెడీ అనిపిస్తుంది. "ఫస్ట్ టైం ఒక అమ్మాయిని డెలివరీ చేయడం చూడలేదు" అంది ఆ మాట నిజంగా కామెడీ అనిపిస్తుంది. ఇక నెటిజన్స్ ఐతే అదే విషయాన్నీ కామెంట్స్ చేశారు " అమ్మాయిని డెలివరీ చేయలేదు బేబక్క..అమ్మాయి ఫుడ్ డెలివరీ చేసింది" అని కామెంట్స్ పెడుతున్నారు.