English | Telugu

పెళ్లి చేసుకున్న బాహుబలి 'కట్టప్ప'

మనసు బాగోలేదంటే చాలు చాలా మంది జంధ్యాల మార్క్ మూవీస్ చూసి మనసారా నవ్వుకుని హ్యాపీగా రిలాక్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కాదు కాదు బుల్లితెరపై ట్రెండ్ సెట్ చేసింది జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇందులో వస్తున్న కామెడీకి ప్రతీ ఒక్కరూ ఫిదా ఐపోతున్నారు. జబర్దస్త్ షో కన్నా కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ కే ప్రేక్షకులు ఎక్స్ట్రా వోటింగ్ వేసి మంచి రేటింగ్స్ తో దూసుకుపోయేలా చేస్తున్నారు. కొత్తకొత్త వాళ్ళు కూడా ఈ షోలో ఎంట్రీ ఇస్తూ కామెడీని చక్కగా పండిస్తున్నారు.

రాజమౌళి మార్క్ మూవీ బాహుబలి ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు. ఆ మూవీలో కట్టప్ప పాత్ర ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. మూవీలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన కట్టప్పను చూసాం. కానీ ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనే కామెడీ కాన్సెప్ట్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ షో రెడీ అయ్యింది. దీనికి సంబందించిన ప్రోమోని మల్లెమాల రిలీజ్ చేసింది. ఇందులో కట్టప్పగా ఇమ్మానుయేల్, కట్టప్పను పెళ్లి చేసుకునే అమ్మాయిగా ఫైమా నటించారు. శివగామిగా రోహిణి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఈ సీరియల్ కి జడ్జెస్ గా సదా, ఇంద్రజ వ్యవహరించారు. "వెళ్ళవయ్యా వెళ్ళు" అనే రాజ్యానికి సదా మహారాణి అని, హోస్ట్ రష్మీ ఆమె చెలికత్తె అని ఇమ్మానుయేల్ చెప్పే పంచ్ డైలాగ్ అద్భుతంగా పేలింది. ఇక బులెట్ భాస్కర్ ని, రోహిణిని ఫైమా పిచ్చికొట్టుడు కొట్టేసరికి ఇద్దరూ ఏడ్చేస్తారు. ఆ సీన్ తో కడుపు చెక్కలైపోతుంది. ఇక మరో స్కిట్ లో రష్మీ పెళ్లికూతురిగా పెళ్ళిపీటల మీద కూర్చుంటుంది. రష్మీకి అన్నయ్య పాత్రలో ఆటో రాంప్రసాద్ నటన వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రష్మీని పెళ్లి చేసుకోబోయే ఆ వరుడు ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ స్కిట్స్ ని ఎంజాయ్ చేస్తే చాలు మంచి ఎనర్జీ వస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ జూన్ 3 న టీవిలో ప్రసారం కాబోతోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...