English | Telugu
గేట్ ఓపెన్ చేస్తే వెళ్లిపోతా..బిగ్ బాస్ కు షాకిచ్చిన బాబా భాస్కర్
Updated : May 19, 2022
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ మొత్తానికి గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. 18 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ ఓటీటీ షోలో చివరికి 7గురు సభ్యులు మిగిలారు. బాబా భాస్కర్, అఖిల్, బిందు మాధవి, అరియానా, మిత్ర, అనిల్, యాంకర్ శివ మిగిలారు. ఈ వారం మధ్యలో ఒకరు ఇంటి దారి పట్టనుండగా వారాంతానికి ముందే మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారు. ఇదిలా వుంటే బుధవారం నాటి ఎపిసోడ్ లో బాబా భాస్కర్ ఫినాలేకి చేరుకోవడంతో అతనికి సంబంధించిన స్పెషల్ వీడియోను ప్లే చేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే బాబా భాస్కర్ వీడియో ఓ రేంజ్ లో వుంది. ఆర్ ఆర్, విజువల్స్, లైటింగ్ ఎఫెక్ట్స్ తో ఓ రేంజ్ లో బాబా భాస్కర్ కు బిగ్ బాస్ వీర లెవెల్లో ట్రీట్ ఇచ్చేశాడు. దీంతో బాబా భాస్కర్ ఎమోషనల్ అయ్యాడు. 35 నిమిషాల పాటు సాగిన బాబా వీడియో అతన్ని సర్ ప్రైజ్ చేసింది. ఓ రేంజ్ లో ఈ వీడియోతో బాబా భాస్కర్ కు బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్ అంతా ఇంతా కాదు. తనే ఫైనలిస్టా అనే స్థాయిలో బాబా భాస్కర్ వీడియోను రూపొందించడం విశేషం.
ఈ వీడియో చూసిన బాబా ఆనందంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇంత బాగా చూపిస్తారని తాను ఊహించలేదన్నాడు. వేరే లెవెల్ లో వుంది. త్రీ వీక్స్ ఫుటేజ్ లా కాకుండా 87 డేస్ ఫుటేజ్ వీడియోలా వుందని సంబరపడ్డాడు. 'నా లైఫ్ లో ఈ వీడియో చాలు.. ఈ కప్పు వద్దు .. డబ్బు వద్దు... ఇప్పడు గేట్ ఓపెన్ చేస్తే వెళ్లిపోతా'.. అంటూ బిగ్ బాస్ కు షాకిచ్చినంత పని చేశాడు బాబా భాస్కర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.