English | Telugu

అషు అక్కా... వాడు నీపక్కన బాలేడు!

'కామెడీ స్టార్స్'లో హరి, అషురెడ్డి మధ్య లవ్ ట్రాక్స్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ సెట్ అయినట్టే కనబడుతోంది. హరి తన గుండెలపై అషురెడ్డి పేరును టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే. అది రియల్ టాటూ అని తెలిసి, షోలో అతడిని అషురెడ్డి చాచిపెట్టి కొట్టింది. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా అది రియల్ టాటూ అని చెప్పుకొచ్చింది. ప్రోగ్రామ్ లో మాత్రమే కాదు, రియల్ గానూ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సెట్ అయినట్టు ఉంది.

హరి, అషురెడ్డి కెమిస్ట్రీ రీల్స్‌కు ఎక్కింది. రీసెంట్‌గా ఇద్దరూ కలిసి ఒక రీల్ చేశారు. అందులో కూడా హరిని అషురెడ్డి చాచిపెట్టి కొట్టడం విశేషం. పైకి గట్టిగా కొట్టినట్టు కనిపించినా... ప్రేమతో కొట్టిందని అది చూస్తుంటే తెలుస్తుంది. రీల్ కాన్సెప్ట్ అటువంటిది మరి. అయితే, సోషల్ మీడియాలో కామెంట్స్ మాత్రం చాలా వెరైటీగా ఉన్నాయి.

'మీరిద్దరూ నిజంగా లవర్సా?' అని ఒకరు ప్రశ్నించారు. ఇంకొకరు వీళ్ళిద్దరిదీ పబ్లిసిటీ స్టంట్ కింద కొట్టి పారేశారు. అషురెడ్డి, హరి ప్రేమలో ఉన్నారని ఇద్దరు ముగ్గురు కామెంట్లు చేశారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అన్నారొకరు. ఒక్కరు మాత్రం 'అక్కా.. వాడు నీ పక్కన బాలేడు' అని కామెంట్ చేయడం గమనార్హం.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...