English | Telugu

నువ్వు చీపురు ప‌ట్టుకుంటే, చీపురుకే అందం వ‌స్త‌ది!

బుల్లితెర‌పై కొత్త కొత్త జంట‌లు పాపుల‌ర్ అయిపోతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ తో ర‌ష్మీ, సుడిగాలి సుధీర్ పాపుల‌ర్ అయిపోతే `కామెడీ స్టార్స్` తో ఎక్స్‌ప్రెస్ హ‌రి - అషురెడ్డి క్రేజీ జంట‌గా పేరు తెచ్చుకున్నారు. ఓంకార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ కామెడీ షోలో వీరిద్ద‌రు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఓ స్కిట్ లో ఏకంగా చెస్ట్ పై అషురెడ్డి పేరుని టాటూగా వేసుకుని షాకిచ్చాడు హ‌రి. త‌ను చేసిన ప‌నికి అషురెడ్డి కూడా ఒక్క‌సారిగా షాక్ కు గురైంది.

Also read:రొమాన్స్‌లో నిండా మునిగిపోయిన మోనిత‌, ఆదిత్య!

ఆ త‌రువాత వీరిద్ద‌రి జోడీ నెట్టింట వైర‌ల్ గా మారింది. అక్క‌డి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్ థింగ్ అంటూ జోరుగా వార్త‌లు రావ‌డం మొద‌లైంది. ఈ వార్త‌ల్ని నిజం చేస్తూ హ‌రికి అషురెడ్డి కాస్ట్లీ బైక్ ని గిఫ్ట్ గా ఇవ్వ‌డం.. ఇలా త‌న ఫ్యామిలీ వాళ్లే నాకు గిఫ్ట్ లు ఇవ్వ‌లేద‌ని హ‌రి ఎమోష‌న‌ల్ కావ‌డం.. వార్త‌ల్లో న‌లిగింది. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైందా? లేక అది కేవ‌లం ఫ్రెండ్షిప్పేనా? అనే విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ రావ‌డం లేదు.

గ‌త కొన్ని వారాలుగా కామెడీ స్టార్స్ షో లో క‌నిపించ‌ని అషురెడ్డి సోష‌ల్ మీడియాలో మాత్రం వ‌రుస ఫొటో షూట్ ల‌తో ర‌చ్చ చేస్తోంది. తాజాగా ప‌ని మ‌నిషి గెట‌ప్‌లో పాత్ర‌లు క‌డుగుతూ, చీపురు ప‌ట్టుక‌ని ఊడుస్తున్న‌ట్టుగా ఫొటోల‌కు పోజులిచ్చింది. అయితే ఈ ఫొటోలు చూసిన హ‌రి.. ఆమెపై సెటైర్ వేశాడు. "ఆ రెండో పిక్చ‌ర్‌, 9 పిక్చ‌ర్ చాలా నేచుర‌ల్‌గా ఉన్నావ్‌, బాగా సూట్ అయ్యావ్ కూడా అషు. ఆ డైలాగ్ గుర్తువ‌చ్చింది.. పొనిడి గెట‌ప్‌లో అంత నాచుర‌ల్‌గా ఉన్నావ్ రా" అని కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అషురెడ్డి "నువ్వు చీపురు ప‌ట్టుకుంటే చీపురుకే అందం వ‌స్త‌ది" అని కౌంట‌రిచ్చింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...