English | Telugu
రాగసుధ హత్య కోసం ఆర్యవర్ధన్ కుట్ర?
Updated : Feb 2, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` ఫేమ్ వెంకట్ శ్రీరామ్, వర్ష హెచ్ కె ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరు పద్మ, జయలలిత, జ్యోతిరెడ్డి, రాం జగన్ కీలక పాత్రలు పోషించారు. గత కొన్ని వారాలుగా ఆసక్తికర మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ తాజాగా సరికొత్త ట్విస్ట్ లతో సాగుతోంది. రాజ నందిని సోదరి రాగసుధని వెతుక్కుంటూ గుడికి వెళ్లిన అను తన కోసం అక్కడే ఎదురుచూస్తూ వుంటుంది.
అయితే అనూహ్యంగా ఆర్యవర్ధన్ ఆఫీస్‌లోకి వెళ్లిన రాగసుధ అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో జెండే కాలికి గాయం చేసి తప్పించుకుంటుంది. అను వున్న గుడికి బయలుదేరుతుంది. తన గురించి తెలుసుకున్న జెండే, ఆర్య వర్ధన్ .. రాగసుధ ఎట్టిపరిస్థితుల్లోనూ హత్య చేయబడాలని ప్లాన్ వేస్తారు. ఇందు కోసం ఓ ముఠాని కూడా ఏర్పాటు చేసి రాగసుధని హత్య చేయాలని, అయితే అది యాక్సిడెంట్ లా వుండాలని చెబుతాడు జెండే.
Also Read:శ్రీకాంత్ డైరెక్షన్ లో బాలయ్య!?
రాగసుధ .. అను వున్న గుడికి వెళుతున్న క్రమంలో జెండే మనుషులు ఆమెకు యాక్సిడెంట్ చేసి చంపాలని చూస్తారు. ఆ సమయంలో అను తల్లిదండ్రులు రాగసుధని రక్షిస్తారు. ఈ ప్రమాదం లో రాగసుధ కాలు బెనకడంతో నడవలేకపోతుంది. దీంతో తమ ఇంటికి రమ్మని చెబుతారు అను తల్లి, తండ్రి, కానీ రాగసుధ అంగీకరించదు. పోనీ మీ వాళ్లు ఎవరైనా వుంటే చెప్పు మేము కబురు చేస్తాం అంటాడు అను తండ్రి సుబ్బు. అయితే తనకు ఎవరూ లేరని, తను అనాథని అని చెబుతుంది రాగసుధ. అయితే మా ఇంటికి రామ్మా అంటారు. దీంతో జెండే మనుషుల నుంచి తప్పించుకోవాలంటే వీళ్ల దగ్గర వుండటమే కరెక్ట్ అని భావించి వారితో వెళ్లిపోతుంది రాగసుధ. వారితో టిఫిన్ సెంటర్ లో పని చేస్తున్న రాగసుధని వెతుక్కుంటూ పోలీసులు వస్తారు.. ఆ తరువాత ఏం జరిగింది? జెండే మనుషులు రాగసుధ ఎక్కడుందో కనిపెట్టారా? ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.