English | Telugu

అన‌సూయ‌కు సారీ చెప్పిన శివ‌.. ఫూల్స్ అయిన ఫ్యాన్స్‌!!

రీసెంట్ గా 'జబర్దస్త్'కు సంబంధించిన ప్రోమో ఒకటి యూట్యూబ్ లో బాగా వైరల్ అయింది. స్టేజ్ మీద యాంకర్ శివ అడిగిన ప్రశ్న‌కు ఆ షో వ్యాఖ్యాత, నటి అనసూయ కోప్పడి వెళ్లిపోయింది. హైపర్ అది స్కిట్ లో భాగంగా గెస్ట్ గా వచ్చిన యాంకర్ శివ.. మిమ్మల్ని ఎప్పటినుండో ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నా అని.. ఆమె డ్రెస్సింగ్ గురించి అడిగాడు.

దానికి అనసూయ 'అది నా పర్సనల్ విషయం' అని చెప్పింది. వెంటనే శివ.. 'పర్సనల్ అయితే ఇంట్లో చూసుకోవచ్చుగా.. ఇక్కడ ఎందుకు' అని అనగానే.. అనసూయ కోపంతో వెళ్లిపోయింది. ఇది చూసిన అభిమానులు నిజంగానే అనసూయ హర్ట్ అయి వెళ్లిపోయిందని అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఎప్పటిలానే ఈ ప్రోమోని కూడా పబ్లిసిటీ కోసం అలానే కట్ చేశారు.

స్టేజ్ మీద నుండి కోపంగా వెళ్లిపోయిన అనసూయను హైపర్ ఆది, యాంకర్ శివ కన్విన్స్ చేసి స్టేజ్ మీదకు తీసుకురావడానికి ప్రయత్నించారు. యాంకర్ శివ పదే పదే అనసూయకు సారీ చెప్పారు. ఈ బాగోతాన్ని జడ్జిలు రోజా, మను చూస్తూ ఉన్నారు. ఆ తరువాత స్టేజ్ మీదకు వచ్చిన అనసూయ 'రోజా గారు మీరు నమ్మేశారు కదా' అంటూ ఫూల్ చేసే ప్రయత్నం చేసింది. దానికి రోజా అస్సలు నమ్మలేదంటూ అనసూయ గాలి తీసేసింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...