English | Telugu

నేను డాన్స్ చేస్తే గుర్రాలు కూడా విజిల్స్ వేస్తాయి

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని వినాయక నిమజ్జనం వేడుకలను పురస్కరించుకుని డిజైన్ చేశారు. ఇందులో ఎన్నో సెగ్మెంట్స్ ని కూడా యాడ్ చేసారు. ప్రతీ ఏడాది మగవాళ్లే కదా వినాయక నిమజ్జనం చేసేది కానీ ఈ ఏడాది మాత్రం ఆడవాళ్ళం చేస్తాం అంటూ లేడీస్ అంతా ఘాటుగా చెప్పేసారు. అలాగే ఒకప్పుడు అనిత..అనితా అనే సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో..ఆ పాటని ప్రతీ లవర్ ఎంతలా ఆదరించారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సింగర్ నాగరాజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీదకు వచ్చి ఆ సాంగ్ ని మళ్ళీ పాడి వినిపించాడు. ఇక ఇంద్రజ ఐతే మాములుగా ఊగిపోలేదు. "ఇప్పటికీ నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు విజిల్స్ వేస్తారు తెలుసా" అని చెప్పింది. ఇక రష్మీ కౌంటర్ వేసింది. "నేను డాన్స్ చేస్తే కుర్రాళ్ళు కాదు గుర్రాలు కూడా విజిల్స్ వేస్తాయి" అంటూ ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో డాన్స్ లు చేశారు. ఇక ఫైమా ఈ షోలో తన బలప్రదర్శన చూపించింది.

ఆటో రాంప్రసాద్ ఆమె నెత్తి మీద ఒక గాజు సీసాను బద్దలా కొట్టాడు. అలాగే ఆమె చేతి మీద బల్బ్ ని పగలగొట్టాడు. ఇక ఫైమా ఐతే కుండల్ని బద్దలుకొట్టింది. ఇక రమ్యకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఢీ 17 విన్నర్ వర్షిణి రమ్యకృష్ణ గెటప్ లో వచ్చింది అలాగే ఆటో రాంప్రసాద్ రజనీకాంత్ గెటప్ లో వచ్చి నరసింహ మూవీలో ఒక బిట్ ని స్పూఫ్ గ చేసి చూపించాడు. ఇక ఇందులో క్యాష్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేసింది రష్మీ.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...