English | Telugu

తాగుబోతు ర‌మేష్‌కు రంగ‌మ్మ‌త్త జ‌బ‌ర్ద‌స్త్ పంచ్‌!

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్. ఈ షోతో చాలా మంది పాపుల‌ర్ అయ్యారు. సుడిగాలి సుధీర్, ర‌ష్మి గౌత‌మ్ జంట గురించి అయితే ఇక చెప్పాల్సిన ప‌ని లేదు. వీరిద్ద‌రు ఈ షో కార‌ణంగా సెల‌బ్రిటీలుగా మారిపోయారు. ఇదే షోలో హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన అన‌సూయ కూడా స్టార్ గా మారిపోయింది. సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో ప‌క్క జ‌బ‌ర్ద‌స్త్ షోలోనూ కంటిన్యూ అవుతోంది. తాజాగా సంక్రాంతి ఫెస్టివ‌ల్ కోసం ప్ర‌త్యేక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

ఈ షోలో యంగ్ డైరెక్ట‌ర్ మారుతి గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. రోజా, సింగ‌ర్ మ‌నో న్యాయ‌నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట ఆక‌ట్టుకుంటోంది. ప్రోమో స్టార్టింగ్ లో అన‌సూయ‌, మారుతి డ్యాన్స్ చేస్తూ హుషారుగా క‌నిపించారు. ఆ త‌రువాత హైప‌ర్ ఆది త‌న టీమ్ తో ఎంట్రీ ఇచ్చి హ‌ల్ చ‌ల్ చేశాడు. త‌న టీమ్ మెంబ‌ర్స్ పై హైప‌ర్ ఆది వేసిన పంచ్ లు న‌వ్వులు కురిపించాయి. నా కోసం అభిమానులు క్యూ క‌డుతున్నార‌ని ఓ కంటెస్టెంట్ అన‌గానే "ఇప్పుడే పునుగుల కోసం గంట‌న్న‌ర క్యూలో నిల‌బ‌డ్డావ్. అలాంటి నీకోసం అభిమానులు క్యూ క‌డుతున్నారా?" అని హైప‌ర్ ఆది పంచ్ వేయ‌డంతో అక్క‌డ న‌వ్వులు విరిశాయి.

ఆ వెంట‌నే తాగుబోతు ర‌మేష్ ఎంట్రీ ఇచ్చాడు. హుషారుగా డ్యాన్స్ చేస్తూ తాగుబోతు ర‌మేష్ స్టేజ్ పైకి వ‌చ్చేశాడు. వెంట‌నే అత‌న్ని గ‌మ‌నించిన మారుతి "ర‌మేష్ నువ్వు ఎంత ఫ్రెష్ గా రెడీ అయిన వ‌చ్చినా ఇప్పుడే బార్ నుంచి వ‌చ్చిన‌ట్టుగా వుంటావు" అని పంచ్ వేశాడు. వెంట‌నే అందుకున్న అన‌సూయ "మీరు కాబ‌ట్టి అనేశారు మేమైతే అలా అన‌లేం క‌దా?" అంటూ జోక్ పేల్చింది. ఈ పంచ్ ప‌డ‌గానే రోజా, మారుతి, తాగుబోతు ర‌మేష్‌, మ‌నో గొల్లున న‌వ్వేశారు. ఈ రోజు రాత్రి ప్ర‌సారం కానున్న ఈ షో ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...