English | Telugu

వ్యాక్సిన్ వేయించుకోవడానికి అనసూయ పాట్లు!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తరచూ ఏదొక టాపిక్ మీద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. ఆమెకి సపోర్ట్ చేసే వారికంటే ట్రోల్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆమె డ్రెస్సింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ట్రోల్స్ పడుతూనే ఉంటాయి. అయినప్పటికీ అనసూయ మాత్రం తనకు నచ్చినట్లే ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ తన భర్త భ‌రద్వాజ్‌తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో స్వచ్చంద సంస్థలు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపడుతున్నారు. దీంతో అనసూయ కూడా వ్యాక్సిన్ కోసం వెళ్లింది. అయితే ఆమెకి సూది మందంటే భయమని తెలుస్తోంది.

వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకొని.. కళ్లు మూసుకొని తెగ భయపడిపోయింది. మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకున్నామని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంకుర హాస్పిటల్స్ చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగుందని కూడా అనసూయ కితాబిచ్చింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. బుల్లితెరపై టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. 'పుష్ప' లాంటి భారీ బడ్జెట్ సినిమాలో ఓ పాత్రలో కనిపించనుంది. అలానే తమిళ, మలయాళ సినిమాల్లో కొన్ని సినిమాలు చేస్తోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...