English | Telugu

‘టాక్సిక్‌’ రిలీజ్‌ డేట్‌ మరోసారి ఫిక్స్‌.. మొదలైన కౌంట్‌డౌన్‌!

Publish Date:Dec 9, 2025

- ఒక రేంజ్‌లో యశ్‌ క్యారెక్టరైజేషన్‌ - ఈసారి అనిరుధ్‌ రవిచందర్‌దే బాధ్యత - నెక్స్‌ట్‌ లెవల్‌లో పిక్చరైజేషన్‌ ‘కెజిఎఫ్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా హీరో యశ్‌కి ఎంత ఫాలోయింగ్‌ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్‌ తర్వాత యశ్‌ చేయబోతున్న సినిమా ఏమిటి? అది ఏ రేంజ్‌లో ఉండబోతోంది అనే చర్చ ముమ్మరంగా జరిగింది. కెజిఎఫ్‌ సిరీస్‌తో హీరోకి ఎంత ఎలివేషన్‌ ఇవ్వాలో మాక్సిమమ్‌ ఇచ్చాడు ప్రశాంత్‌ నీల్‌. దాన్ని కంటిన్యూ చేసేలా నెక్స్‌ట్‌ సినిమా ఉండాలి. అయితే అతని నెక్స్‌ట్‌ మూవీ ‘టాక్సిక్‌’ని లేడీ డైరెక్టర్‌ గీతూ దాస్‌ డైరెక్ట్‌ చెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే యశ్‌కి ఉన్న క్రేజ్‌ని ఏమాత్రం తగ్గించకుండా ‘టాక్సిక్‌’ చిత్రాన్ని నెక్స్‌ట్‌ లెవల్‌లో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం.    Also Read: విషాదాంతమైన హీరోయిన్‌ జీవితం.. ఆ బయోపిక్‌లో రష్మిక మందన్న?   పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న టాక్సిక్‌ చిత్రంలో యశ్‌ తన నట విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో అతని క్యారెక్టర్‌ ఏ రేంజ్‌లో ఉండబోతోంది అనే డిస్కషన్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అయితే ముందుగా ఎనౌన్స్‌ చేసిన డేట్‌కి సినిమా రిలీజ్‌ అవ్వదని, వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి.    ఆ వార్తలకు చెక్‌ పెడుతూ ఒక పవర్‌ఫుల్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో యశ్‌ ఏ రేంజ్‌లో కనిపించబోతున్నాడు అనేది ఈ పోస్టర్‌ తెలియజేస్తోంది. అంతేకాదు ‘100 డేస్‌ టు గో’ అంటూ ఒక క్యాప్షన్‌ కూడా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. 2026 మార్చి 19న ‘టాక్సిక్‌’ అనే భారీ యాక్షన్‌ మూవీతో యశ్‌ రాబోతున్నాడు అని మరోసారి కన్‌ఫర్మ్‌ చేశారు.    Also Read: చరణ్ ని కలిసిన జపాన్ మహిళా ఫ్యాన్స్..  ఏం గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా!   కెజిఎఫ్‌ తర్వాత అన్ని ఏరియాల్లోనూ యశ్‌కు అభిమానులు ఏర్పడ్డారు. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్‌ను స్ట్రాంగ్‌గా కన్‌ఫర్మ్‌ చేసింది చిత్ర యూనిట్‌. యశ్‌ రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా ‘టాక్సిక్‌’ క్యాస్టింగ్‌ కూడా చాలా సాలిడ్‌గా ఉంది. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌, హుమా ఖురేషీలాంటి స్టార్‌ హీరోయిన్స్‌ ఈ సినిమాలో ఉండడం సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్‌ కాబోతోంది.    ‘కెజిఎఫ్‌’ సిరీస్‌లో తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో బాక్సులు బద్దలు చేసిన రవి బస్రూర్‌ను కాకుండా మరో క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌కు ‘టాక్సిక్‌’ మ్యూజిక్‌ చేసే బాధ్యతను అప్పగించారు. ఇండియాలో నిర్మాణం జరుపుకుంటున్న భారీ చిత్రాల్లో ఒకటైన ‘టాక్సిక్‌’ని కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్‌తో యశ్‌ హంగామా మొదలైంది. ముఖ్యంగా కర్ణాటకలో యశ్‌ అభిమానుల్లో ఇప్పటి నుంచే సందడి మొదలైంది. 

Akhanda 2 pushes Mowgli for direct OTT release? 

Publish Date:Dec 9, 2025

  Akhanda 2 starring God of Masses Nandamuri Balakrishna is scheduled for a grand release on 5th December. EROS and several local distributors have taken the last minute decision to push the release of the movie into jeopardy with their demands to immediate finance clearance from producers 14 Reels Plus.    Now, all the parties have entered into an out-of-court settlement, whose details are not yet known, and makers are eyeing for 12th December release that would keep them safe from Avatar 3 storm and other Christmas release difficulties. But this postponement has come as a big obstacle for Sandeep Raj's Mowgli.    The medium budget movie with Roshan Kanakala and Sakshi Sagar as leads had been locked for theatrical release on 12th December. But they cannot clash with Akhanda 2 and People Media Factory, the producers, have entered into an OTT deal earlier. So, if the production house decides to go for another date, it would be improbable.    Mowgli needs to fight with even bigger films on 19th, 25th and even 31st December dates. Also, the OTT deal could get slashed and this will prove to be even bigger headache for PMF, who are said to be facing some financial issues with The Raja Saab postponements and they are focused on releasing it on the scheduled date.    So, this film is said to be not their high priority at this moment. So, director Sandeep Raj tweeted on X, sharing his concerns, "Maybe Colour Photo and Mowgli deserved another DIRECTOR instead of me. These movies were made by a group of passionate people who can do anything for their profession. The common points between both films are: 1. Facing bad luck with their release, just when everything seemed to be going well. 2. Me. Maybe I am the BAD LUCK."      He continued to reason by saying, "Even I’m starting to feel that way. My dream of seeing the title “Directed by Sandeep Raj” on the big screen is becoming harder day by day. I think SILVERSCREEN hates me. Mowgli was made with the passion, sweat, and blood of so many dedicated people like Roshan, Saroj garu, Sakshi, Harsha, DOP Maruthi, Bhairava and many more. I truly hope that all good things happen to Mowgli at the very least for their sake."   Well, the unfortunate situation looks to have put him in depression to state such emotional words. How will everything pan out has to be seen in coming days. Akhanda 2 producers cannot hold on to the film longer, as they have to release as soon as they can.    On the other hand, Mowgli had been in production for long and makers cannot take too much of losses with this film as they have even bigger one The Raja Saab waiting on their back as per reports, taking all of their finances, creating doldrums until release. No one is in a position to say anything at the moment.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  

సాయం చెయ్యడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్న మహానటి సావిత్రి!

Publish Date:Dec 5, 2025

(డిసెంబ‌ర్ 6 మ‌హాన‌టి సావిత్రి జ‌యంతి సంద‌ర్భంగా..) సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో మద్రాస్‌ చేరుకున్న సావిత్రి చిన్న చిన్న పాత్రలు వేస్తూ మహానటిగా ఎలా ఎదిగారో అందరికీ తెలిసిందే. ఆమె నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు భారీ విరాళాలు అందించారు. అంతేకాదు, తోటి నటీనటులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వారికి ఆర్థిక సాయం చేశారు.  అలాంటి మహౌన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సావిత్రి చివరి దశలో ఎలాంటి కష్టాలు అనుభవించారు, ఆర్థికంగా ఎలాంటి ఒడిడుకులకు లోనయ్యారు అనేది మనకు తెలుసు. తను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఇతరులకు సాయం చేయడానికి వెనుకాడే వారు కాదు. అప్పు చేసైనా తనకు చేతనైనంత సహాయం చేసేవారు. అలాంటి ఓ అరుదైన సంఘటన 1975లో జరిగింది.  నటిగా తను మంచి స్థాయిలో ఉన్నప్పుడు వడ్డీవారిపాలెం గ్రామంలో ఒక పాఠశాలను తన స్వంత ఖర్చులతో నిర్మించారు సావిత్రి. శ్రీమతి సావిత్రి గణేష్‌ పాఠశాల పేరుతో ఆ స్కూల్‌ను 1962లో స్థాపించారు. ఆ తర్వాత పాఠశాలను ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి శ్రీమతి సావిత్రి గణేష్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలగా పేరు మారింది. పాఠశాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ వచ్చేది. దానితోనే సిబ్బందికి జీతాలు ఇచ్చేవారు.  1975 ప్రాంతంలో పాఠశాల ఎలా ఉంది అనే విషయం తెలుసుకునేందుకు ఆ స్కూల్‌ కరస్పాండెంట్‌కు ఫోన్‌ చేశారు సావిత్రి. అతను చెప్పిన మాటలు విని ఆమె షాక్‌ అయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్‌ రాకపోవడం వల్ల 5 నెలల నుంచి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడం లేదని ఆయన చెప్పారు. సావిత్రి మరో మాట మాట్లాడకుండా ఆ కరస్పాండెంట్‌ను మద్రాస్‌ రమ్మని చెప్పారు.  మద్రాస్‌ వెళ్లిన ఆ కరస్పాండెంట్‌కు 1 లక్షా 4 వేల రూపాయల చెక్కును అందించి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించమని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్‌ విషయం తర్వాత చూసుకుందామని చెప్పి ఆయన్ని పంపించారు. 1975లో లక్ష రూపాయలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం 40 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది.  ఈ డబ్బు చెల్లించే సమయానికి సావిత్రి ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు. అయినప్పటికీ స్కూల్‌ సిబ్బంది కష్టాలు చూడలేక ఆమె ఆ డబ్బును ఏర్పాటు చేశారు. తను ఏ స్థితిలో ఉన్నాను అనేది కూడా ఆలోచించకుండా దానధర్మాలు చేయడానికి వెనుకాడని సావిత్రి వంటి మహాదాత సినీ పరిశ్రమలో మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రేమలో పడిన అమీర్ ఖాన్.. వయసు 60 ఏళ్ళు

Publish Date:Dec 8, 2025

    -అమీర్ ప్రేమ పురాణం  -ఏ నిర్ణయం తీసుకున్నాడు -ఏం చేయబోతున్నాడు       అభిమానులు భారతీయ సినీ ప్రేమికులు అత్యంత గౌరవించే నటుల్లో 'అమీర్ ఖాన్'(Aamir Khan)ఒకరు. సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో ప్రయోగాత్మక క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా అమీర్ ఎన్నో ఎన్నో హిట్స్  లో ఒకటైన దంగల్ పేరు పైనే ఉంది. దీన్ని బట్టి సరైన సినిమా పడితే అమీర్ చరిష్మా ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే గత కొన్ని సంవత్సరాలుగా కట్ అవుట్ కి తగ్గ కథ కుదరకపోవడంతో పరాజయాలని ఎదురుకుంటున్నాడు.ఈ ఏడాది ఆగష్టు లో  రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ ల  'కూలీ' లో గెస్ట్ రోల్ లో కనపడి అలరించాడు.     రీసెంట్ గా అమీర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతు నా మొదటి భార్య రీనా(Reena Dutta)చాలా అద్భుతమైన వ్యక్తి. భార్య భర్తలుగా విడిపోయామే తప్ప మనుషులుగా కాదు.  సెకండ్ వైఫ్ కిరణ్(kiran Rao)కూడా అంతే. కానీ మళ్ళీ 60 ఏళ్ళ వయసులో ప్రేమ దొరుకుతుందని అనుకోలేదు. గౌరీ స్ప్రాట్(Gauri Spratt)మంచి వ్యక్తి. నా జీవితంలోకి ప్రశాంతతని, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. నా వివాహాలు సఫలం కాకపోయినా చాలా విషయాల్లో ఆ ముగ్గుర్ని ఆదర్శంగా తీసుకుంటాను. ఒక వ్యక్తిగా నన్ను చాలా ప్రభావితం చేసారని చెప్పుకొచ్చాడు.   Also read:   ఈ నెల 12 న థియేటర్స్ లోకి ఎనిమిది చిత్రాలు.. పండుగ వచ్చినట్టేనా!      అమీర్ వివాహ విషయాల్ని ఒకసారి చూసుకుంటే అమీర్ ఫిలిం ప్రొడ్యూసర్ అయిన రీనా కి 1986 లో వివాహం జరగగా 2002 లో డైవర్స్ తీసుకున్నారు. ఈ ఇద్దరికి ముగ్గురు పిల్లలు.  రెండో వివాహం దర్శకురాలైన కిరణ్ రావు తో 2005 లో జరగగా ఆరు సంవత్సరాల అనుబంధం తర్వాత 2021 లో విడిపోయారు. ఇక గౌరీ స్ప్రాట్ ని ఈ సంవత్సరం మార్చిలో వివాహం చేసుకున్నట్టుగా అమీర్ ప్రకటించాడు.  ఆమెకి కూడా సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.సినిమాల పరంగా చూసుకుంటే ప్రొడ్యూసర్ గా రెండు విభిన్న చిత్రాలని ప్రకటించిన అమీర్ హీరోగా తదుపరి చిత్రం లోకేష్ కనగరాజ్ తో  ఉండచ్చగానే టాక్ ఇండస్ట్రీ  వర్గాల్లో వినపడుతుంది.          

అసలే చలికాలం..పరివారం షోలో రొమాంటిక్ జోడీల హగ్గుల జాతర..

Publish Date:Dec 9, 2025

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోని వింటర్ స్పెషల్ థీమ్ గా తీసుకురాబోతున్నారు. ఈ ఎపిసోడ్ లో కొత్తగా పెళ్ళైన జంట మహేష్ - సాండ్రా, ఏక్ నాథ్ - హారిక, బ్రహ్మముడి జోడి మానస్ - దీపికా, యాదమ్మ రాజు - స్టెల్లా, నువ్వుంటే నా జతగా సీరియల్ యాక్టర్స్ అర్జున్ కళ్యాణ్ - అనుమిత వచ్చారు. ఈ కూల్ వెదర్ లో మీ అందరికీ హాట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ఫేవరేట్ రొమాంటిక్ జోడీస్ రాబోతున్నారు అని చెప్పింది శ్రీముఖి. ఇక కొత్త జంట మహేష్ సాండ్రా జోడిని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. పూలేసి వాటి మీద సాండ్రాని నడిపించారు. రీసెంట్ గా పెళ్ళైన జంట అంటూ స్టేజి మీద ఉన్న యాక్టర్స్ అంతా పూలు వేసి విష్ చేశారు. పెళ్ళైన వెంటనే వింటర్ వచ్చేసింది కదా అని శ్రీముఖి అనేసరికి సాండ్రా సిగ్గుపడి కళ్ళు మూసుకుంది. "ఆ వింటర్ లో ఎలా ఉంది అనీ" అంటూ శ్రీముఖి రాగం తీసేసరికి "చల్లగానే ఉంది" అంటూ మహేష్ ఆన్సర్ ఇచ్చాడు. "అంటే వింటర్ వస్తేనే రొమాంటిక్ గా చేయాలా" అంటూ ఏక్ నాధ్ అడిగేసరికి అందరూ గట్టిగా అరిచారు. వెంటనే హారికని రెండు చేతుల మీద ఎత్తుకుని ఎప్పుడైనా రొమాంటిక్కే మేము అన్నాడు. "చలి పెడుతుంది ఇప్పుడు -16 డిగ్రీలు అంది అంటే జంటలంతా హగ్ చేసుకున్నారు. దీపికా రెండు చేతులు కట్టుకుంది దాంతో మానస్ వెరీ గుడ్ అన్నాడు. -20 డిగ్రీలు అని శ్రీముఖి అనేసరికి ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నారంతా. దీపికా వచ్చి మానస్ భుజం మీద వాలేసరికి ఓకే అన్నాడు. -30 డిగ్రీలు అని శ్రీముఖి మళ్ళీ అనేసరికి ఏక్ నాధ్ - హారిక ఇద్దరూ చీర చెంగు కప్పేసుకుని ఇంకా గట్టిగ హగ్ చేసుకునేసరికి అందరూ అరిచారు గట్టిగా. ఇక దీపికా ఐతే మానస్ వెనకాల పడింది. దాంతో అవినాష్ దీపికను హగ్ చేసుకున్నాడు.

లేడీ డైరెక్టర్ తో నితిన్ లవ్ స్టోరీ..!

Publish Date:Dec 8, 2025

  వరుస ఫ్లాప్స్ లో నితిన్ ఇంతవరకు కొత్త సినిమాపై క్లారిటీ లేదు ఆ డైరెక్టర్ తో లవ్ స్టోరీ నిజమేనా..?   2020లో వచ్చిన 'భీష్మ' తరువాత హీరో నితిన్ హిట్ చూడలేదు. ఈ ఐదేళ్ళలో వరుసగా ఆరు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూశాడు. దీంతో నితిన్ నెక్స్ట్ ఎవరి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు? దాంతోనైనా కమ్ బ్యాక్ ఇస్తాడా? అనే ఆసక్తి నెలకొంది.   నితిన్ తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. వేణు యెల్దండి దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే సినిమా చేయాల్సి ఉండగా.. ఎందుకో దాని నుండి అవుట్ అయ్యాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తలపెట్టిన సినిమా కూడా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. శ్రీను వైట్ల ప్రాజెక్ట్ ప్రచారానికే పరిమితమైంది. 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ సాయి మార్తాండ్ దర్శకత్వంలో సినిమా అంటూ ఇటీవల న్యూస్ వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది.   ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన.. ఈ ఏడాది 'తెలుసు కదా' సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.    నిజానికి 'తెలుసు కదా' కథ మొదట నితిన్ దగ్గరికే వెళ్ళింది. కానీ, ఏవో కారణాల వల్ల చేయలేదు. అయితే ఇప్పుడు దర్శకురాలిగా నీరజ కోన చేయనున్న రెండో సినిమాకి మాత్రం నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదొక లవ్ స్టోరీ అని సమాచారం.    లవ్ స్టోరీలు నితిన్ కి బాగా కలిసి వస్తాయి. గతంలో వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్.. 'ఇష్క్' అనే లవ్ స్టోరీ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.  

What are the new issues for Akhanda 2 release?

Publish Date:Dec 6, 2025

Akhanda 2 starring God Of Masses Nandamuri Balakrishna, Samyuktha, Aadi Pinisetty, Harshali Malhotra faced last minute hurdle and had to be postponed from the planned release date, 5th December. Now, the movie producers 14 Reels Plus are in a dire situation as the problems compounded massively with postponement.  Reports suggest that Overseas distributors, mainly, US distributors are asking for refunds as Avatar 3 release will definitely dampen chances of Akhanda 2 in upcoming weeks. Netflix, who bought the OTT rights have already asked for a clear picture ahead from producers and are already in re-consideration about deal.  Complicating matters further, the issue with EROS going to Court and then to a single judge bench for revision has gone to the notice of NBK and he is further upset on producers, as he did not know how deep the mess was. So, if the producers sort out issues, will Balayya come back to promote the film?  It is a million dollar question. Further reports state that even local distributors and exhibitors are not ready to pay total promised amounts due to the delay. Producers have been over confident and hid even other financial issues, say reports. The reality of the matter though, the makers need to sort out mess and fix a release date.  According to few sources, the release date has been to finalised before the next Thursday and many agreements for other movies have to be altered to give Akhanda 2 required space. Which seems to be even more difficult. Director Boyapati Srinu is completely upset with the situation and he is trying to understand what is in his hands, say sources.  Well, currently, no one is able to point at a perfect date or timeline when can everything come to a conclusion. Reports have been rampant about film release happening by next week or 25th December. But producers at this moment are buried in issues that only after sorting everything they can think about a date.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

ప్రేమంటే

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969

12A Railway Colony

Publish Date:Dec 31, 1969

Premante

Publish Date:Dec 31, 1969