English | Telugu

గ‌డ్డు ప‌రిస్థితులు.. అందుకే సోషల్ మీడియాకు దూరం.. కారణం చెప్పిన అఖిల్!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. తరచూ పోస్ట్ లు పెడుతూ.. అభిమానులతో టచ్ లో ఉండే సెలబ్రిటీలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే.. ఏమైందా..? అంటూ అభిమానులు టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ ఫ్యాన్స్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. రోజూ ఏదొక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ తో టచ్‌లో ఉండే అఖిల్ వారం రోజులుగా ఒక్క పోస్ట్ కానీ, స్టేటస్ కానీ పెట్టలేదు.

దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అఖిల్‌ను ప్రశ్నిస్తున్నారు. అలానే కొందరు కాల్స్, మెసేజ్ లు చేశారట. అయితే అసలు కారణం చెబుతూ ఇన్స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు అఖిల్. కొన్నిసార్లు మనం మరింత బలంగా తయారవ్వాలంటే కొంత సమయం దూరంగా ఉండాల్సిందేనని చెప్పాడు అఖిల్.ఎన్నో జరిగాయని.. వాటి నుండి ఎంతో నేర్చుకున్నానని.. ప్రతిరోజూ గుణపాఠమే అని చెప్పుకొచ్చాడు.

గత వారం నుండి యాక్టివ్‌గా లేనందుకు క్షమించమని అభిమానులను కోరాడు. ఇప్పుడు మళ్లీ ఫుల్ ఎనర్జీతో మీ ముందుకు వచ్చానని.. ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని.. ఆ కారణంగానే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అభిమానులను ఉద్దేశిస్తూ.. "మీరు గనుక లేకపోతే ఇంకొన్ని రోజులు ఇలానే ఉండిపోయేవాడిని." అని ఫ్యాన్స్ మీద తనకున్న ప్రేమను వ్యక్తప‌రిచాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...