English | Telugu
'చందమామ' సినిమా నుంచి 'అడివి శేష్'ని తీసేశారు
Updated : May 13, 2022
చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన అడివి శేష్.. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈ టాలెంటెడ్ హీరో.. జూన్ 3న 'మేజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న శేష్.. తన కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఆలీతో సరదాగా షోలో శేష్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో తనని ఓ సూపర్ హిట్ మూవీ నుంచి తీసేశారని షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. 2000 నుంచే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన శేష్.. 2002 లో విడుదలైన 'సొంతం' సినిమాలో మెరిశాడు. నిజానికి ఆ సినిమాలో చాలా పెద్ద రోల్ అని చెప్పారట. కానీ తీరా తెరమీద చూస్తే కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించానని అప్పటి సంఘటనని గుర్తుచేసుకున్నాడు శేష్.
అలాగే 2007 లో విడులై సూపర్ హిట్ గా నిలిచిన కృష్ణ వంశీ మూవీ 'చందమామ'లో మొదట అడివి శేషే హీరోనట. నవదీప్ స్థానంలో మొదట తనని పెట్టి రెండు రోజులు షూట్ చేశారని, కానీ తర్వాత ఎందుకో తీసేశారని శేష్ చెప్పుకొచ్చాడు.