English | Telugu
రోడ్డు ప్రమాదంలో శ్రీవాణికి గాయాలు...టెన్షన్ లో భర్త విక్రమాదిత్య
Updated : Oct 14, 2024
బుల్లితెర నటి శ్రీవాణి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఈ విషయాన్ని శ్రీవాణి భర్త విక్రమాదిత్య ఒక వీడియోలో చెప్పుకొచ్చాడు. త్రి డేస్ బ్యాక్ శ్రీవాణి అండ్ ఫామిలీ చీరాల బీచ్ కి వెళ్తుండగా శ్రీవాణి వాళ్ళ అమ్మ వెళ్తున్న కార్ కి యాక్సిడెంట్ ఐనట్టు చెప్పాడు. నుదిటి మీద చీరుకుపోవడంతో పాటు రైట్ హ్యాండ్ కి ఫ్రాక్చర్ ఐనట్టు చెప్పాడు. ఐతే శ్రీవాణిని గుంటూరు లోని ఒక హాస్పిటల్ లో చేర్పించామన్నారు. అలాగే ఆమె నుదురు మీద బాగా డీప్ గా కట్ ఐపోవడంతో కుట్లు కాకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయాలని హాస్పిటల్ వాళ్ళను కోరామన్నారు. ఎందుకంటే షూటింగ్ టైం అక్కడ మార్క్ కనిపిస్తుంది కాబట్టి స్టిక్స్ వద్దు అన్నారట. ఐతే అంత డీప్ గా చర్మం తెగిపోయింది కాబట్టి వాటికి స్టిచెస్ మాత్రమే వేయాలని ప్లాస్టిక్ సర్జరీ పనికి రాదని డాక్టర్స్ చెప్పారంటూ విక్రమాదిత్య చెప్పారు. అలాగే శ్రీవాణి త్వరగా రికవరీ కావాలంటూ విష్ చేయాలంటూ అందరినీ ఈ వీడియో ద్వారా కోరుకున్నారు. ఐతే యాక్సిడెంట్ ఐనప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలన్నారు. అక్కడికి వెళ్తే తమ పరిధి కాదన్నారని చెప్పాడు. అలాగే తామిద్దరం కలిసి కొత్త కొత్త డెసిషన్స్ తీసుకున్నామని అలాగే ఇద్దరూ కలిసి భార్యాభర్తలుగా ఒక సీరియల్ లో నటించడానికి కమిట్ అయ్యామని చెప్పాడు. ఇలాంటి గుడ్ న్యూస్ లు విన్న ఈ టైములో ఇలాంటి ఒక సంఘటన జరిగింది అని బాధపడ్డారు. ఐతే తమ కష్టం చూసినవాళ్లంతా మీ మీద ఉన్న అందరి కూడా దిష్టి పోయింది..కాబట్టి కంగారుపడకండి అన్నారంటూ చెప్పాడు. ఆ వేంకటేశ్వరుడి దయ వలన ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నారు విక్రమాదిత్య, నందిని.