English | Telugu
నేను వన్ డే సిఎం ఐతే ..ఎం మారుస్తానంటే?
Updated : Nov 6, 2025
బుల్లితెర మీద ఒకప్పుడు ప్రసారమైన గృహలక్ష్మి సీరియల్ కి చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ చూసిన వాళ్లంతా ఇంట్లో అమ్మ అంటే ఇలా ఉండాలి అనుకునేలా నటించారు కస్తూరి శంకర్. ఐతే ఆమె ఒక రోజు సీఎం ఐతే ఎం చేస్తారో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "నేను వన్ డే సిఎం ఐతే శంకర్ తో ఒక మూవీ చేస్తా..నో.నో కామెడీగా చెప్పాను. నాకు చాలా రివొల్యూషనరీ థాట్స్ ఉన్నాయి. సీఎం ఐతే గనక నేను మార్చాలనుకునేది చెత్త. ఎక్కడ చూసినా ఆ సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడబడితే అక్కడ చెత్తే వేసేస్తున్నాయి. చూడడానికి ఎత్తైన భవనాలు ఉన్నాయి. పైకి చూస్తే సింగపూర్ లా ఉంది. కానీ కింద చూస్తే అంతా గలీజ్ గలీజ్ గా ఉంది. అది మార్చాలి.
అది ఒక్క రోజులో అవ్వదు కానీ దానికి ఒక దారుణమైన లా పెట్టేయాలన్నా ఒక శాసనం చేయాలన్నా చేస్తా. స్కూల్ లో శుభ్రతకు సంబంధించి ఒక డ్రిల్ల్, ఒక ప్రాక్టీస్ క్లాస్ ఉండేలా చూస్తా. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా నిన్న సోషల్ మీడియాలో ఒకటి షేర్ చేసారు. బెంగళూరులో మంచి మంచి బయో కెమికల్ లాబ్స్, ఫార్మా లాబ్స్ వంటివి చాల ఉన్నాయి. ఐతే ఇక్కడికి వచ్చే టూరిస్టులు రోడ్స్ చూసి ఇంత చెత్తగా ఉన్నాయేమిటి ఇక్కడి రోడ్లు అంటున్నారని పోస్ట్ చేశారు. ఇక నేను ఫిట్నెస్ ఫ్రీక్ ని ఏటిఎం వరకు వాకింగ్ చేస్తూ వెళ్లాను. అటుగా వస్తున్న ఒక బస్ లోంచి ఒకళ్ళు నామీద కిళ్ళీ ఓసి వెళ్లిపోయారు. ఫుల్ నా హెయిర్ అంతా రెడ్ ఐపోయింది. నేను ఒక ఇల్లు కొత్తగా కొన్నాను. దానికి పెయింట్ చేయడానికి వచ్చిన వాళ్ళు నార్త్ నుంచి వచ్చారు. నా హెయిర్ మీద ఉమ్ము ఊసిన వాళ్ళే వచ్చి పెయింట్ చేసి వెళ్లారు." అని చెప్పింది