English | Telugu

రజనీకాంత్‌కు రూల్స్ వ‌ర్తించ‌వా? సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!

నటి కస్తూరి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. 'గృహలక్ష్మి' సీరియల్‌తో కస్తూరి ఇప్పుడు తెలుగువారిని అలరిస్తున్నారు. అలా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటున్న ఆమె.. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఏడాది మే నెల నుండి ఇండియన్స్ ఎవరూ కూడా అమెరికా వెళ్లడానికి వీలు లేకుండా అమెరికా ప్రభుత్వం బ్యాన్ విధించిందని.. మెడికల్ చెక‌ప్స్‌ కోసం కూడా ఛాన్స్ ఇవ్వలేదని.. ఇలాంటి సమయంలో రజనీకాంత్ అమెరికా ఎలా వెళ్లారని ప్రశ్నించారు కస్తూరి. అమెరికాలో పని చేసేవారు.. ఎన్నారైలు మాత్రమే ఇండియా నుండి వెళ్లే ఛాన్స్ ఉందని.. అలాంటి వారిని మాత్రమే అమెరికా రానిస్తోంద‌ని.. కానీ రజనీకాంత్ ఈ సమయంలో అమెరికా వెళ్లడం మిస్టరీగా మారిందని చెప్పుకొచ్చారు.

చాలా మంది ఆయన వైద్యం కోసం భారత ప్రభుత్వం నుండి అనుమతి తీసుకొని అమెరికా వెళ్లారని అంటున్నారు. అసలు ఆయన ఆరోగ్య సమస్య ఏంటని ప్రశ్నించారు కస్తూరి. ఇండియాలో ఆయన్ను ట్రీట్ చేసే హాస్పిటల్స్ లేవా? అంటూ మండిపడ్డారు. రజనీకాంత్ లాంటి పెద్దలు రూల్స్ పాటించకపోతే.. అంతకుమించి దారుణమైనది మరొకటి ఉండదని చెప్పింది. ఏ ఒక్కరూ రూల్స్ కంటే పెద్దవారు కాదని.. అందరినీ ప్రశ్నించవచ్చని.. అది రజనీకాంత్ అయినా సరే, ఇంకొకరు అయినా సరే అంటూ వరుస ట్వీట్లు పెట్టారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...