English | Telugu

నాగార్జునతో రొమాంటిక్ సీన్ లో కస్తూరి శంకర్ 

కస్తూరి శంకర్ అనగానే గుర్తొచ్చే సినిమా అన్నమ్మయ్య మూవీలో హీరో నాగార్జున హీరోయిన్ గా చేసిన రోల్. అలాగే కమల్ హాసన్ తో భారతీయుడు మూవీలో కూడా ఆమె నటించారు. ఇక తెలుగు బుల్లితెర మీద "గృహలక్ష్మి" అనే సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు మంచి పేరు తెచ్చుకున్నారు ఆడియన్స్ నుంచి. ఆమె రీసెంట్ గా తన హీరో నాగార్జున గురించి ఒక ఇంటర్వ్యూలో చాల విషయాలు చెప్పారు. "నాగార్జున గారి గురించి ఎం చెప్తారు" అని హోస్ట్ అడిగేసరికి "నాగార్జున గారి గురించి చెప్పాలంటే పెద్ద హిస్టరీ ఉంది. నేను మొదట్లో యాంకర్ గా పని చేసేదాన్ని. కార్పొరేట్ ఈవెంట్స్ అన్ని ఎంసి చేసే అడ్వర్టైజింగ్ వరల్డ్ లో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు నాగార్జున గారు వచ్చారు.

ఆయన్ని నాకు పరిచయం చేస్తున్నారు.అప్పుడు ఆయన నాకు హ్యాండ్ షాక్ ఇచ్చారు. నిజం చెప్తున్నాను ఆ చేతిని కడక్కుండా రెండు రోజు తిరిగాను. అందరికీ చెప్పాను. ఐతే అందరికీ ఈర్ష్య పుట్టింది. ఎందుకంటే అందరూ నా క్లాస్ మేట్స్ కదా. ఆ టీనేజ్ హప్పినెస్స్ నాకు ఇప్పటి వరకు గుర్తు ఉంది. ఆ విషయాన్నీ నేను అన్నమయ్య సెట్స్ లో కలిసినప్పుడు చెప్పాను. నా కల అలా నెరవేరింది. ఈ మధ్య కాలంలో ఆయన్ని కలవలేదు. ఇప్పుడు కలవాలి. నెక్స్ట్ మూవీ ఎం చేస్తున్నారో అడగాలి. ఇప్పుడు ఆయన విలన్ గా బాడ్ గైగ మళ్ళీ క్రేజ్ ఇపోయారు. మా జెనెరేషన్ లో హీరోగా క్రష్ అయ్యారు. ఇప్పుడు జెన్ జికి క్రష్ అయ్యారు. రొమాంటిక్ సీన్ కావొచ్చు ఇంకా ఛాలెంజింగ్ సీన్ ఐనా కానీ కంఫర్ట్ ఫాక్టర్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఆయన చాలా ప్రొఫెషనల్." అని చెప్పుకొచ్చింది కస్తూరి శంకర్.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.