English | Telugu

కూతురికి పేరు పెట్టిన హ‌రితేజ‌.. ఆ పేరే ఎందుకంటే..!!

బుల్లితెరపై సీరియల్స్‌తో ఫేమస్ అయిన హరితేజ ఆ తరువాత సినిమా అవకాశాలు దక్కించుకుంది. బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయిన తరువాత ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. బిగ్ బాస్ షో లంటే ముందుగా ఆమెకి ఎక్కువగా సీరియల్స్‌లో నెగెటివ్ రోల్స్ వచ్చేవి. కానీ బిగ్ బాస్ షో తరువాత ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా 'అ ఆ' సినిమా హరితేజ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అయింది.

ఈ సినిమాతో కమెడియన్‌గా మారిపోయింది హరితేజ. తెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ హరితేజ నవ్వులు పూయిస్తుంటుంది. అలా హరితేజకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే హరితేజ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. డెలివెరీ సమయంలో తాను పడిన కష్టాల గురించి హరితేజ చెప్పిన విషయాలు అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశాయి.

ఇక తనకు పుట్టిన పాపను ఇప్పటివరకు క్లియర్‌గా బ‌య‌ట‌కు చూపించలేదు హరితేజ. మొహాన్ని చూపించకుండా హరితేజ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా హరితేజ తన కూతురికి అదిరిపోయే పేరు పెట్టింది. 'భూమి దీపక్ రావ్' అంటూ పెట్టిన పేరుకి వివరణ కూడా ఇచ్చారు. ''భూమి అంటే సహనంతో ఉంటుందని అనుకుంటున్నారు.. కానీ వాళ్లకేం తెలుసు సహనాన్ని పరీక్షిస్తే భూకంపాలే'' అని తన బిడ్డ చెబుతున్నట్టుగా హరితేజ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...