English | Telugu

ఫస్ట్ నైట్ ప్రాప్తిరస్తూ... ఐ లవ్ యు శ్రీముఖి


ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం షో ఫుల్ జోష్ తో సాగింది. ఈ షోకి ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ నుంచి రామరాజు ఫామిలీ, భద్రావతి ఫామిలీ వచ్చారు. ఇక రామరాజుకు సీరియల్ లో ముగ్గురు కొడుకులు ఉంటారు. చందు, సాగర్, ధీరజ్ వచ్చారు. ఐతే మీ పెద్దబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు..నేను ఉన్నా చూడండి...మా జంటను ఒకసారి ఎలా ఉంటామో చెప్పండి అనేసరికి రామరాజు చందుని, శ్రీముఖిని పక్కపక్కన పెట్టి పిన్ని పక్కన నిలబడినట్టు ఉంది పక్కకు రా అనేశాడు. దానికి శ్రీముఖి గట్టిగా నవ్వేసింది. తర్వాత సాగర్ దగ్గరకు వెళ్ళింది శ్రీముఖి. వెంటనే సాగర్ శ్రీముఖి కాళ్లకు దణ్ణం పెట్టేసరికి "అయ్యో నేను మీకంటే చిన్నదాన్ని" అనేసింది. తర్వాత సాగర్ తన వైఫ్ అంటూ చూపించాడు. వెంటనే శ్రీముఖి వాళ్లకు బ్లేసింగ్స్ ఇచ్చి రామరాజు గారిని తాతయ్యను చేయాలి అంటూ చెప్పింది. వెంటనే సాగర్ దగ్గరకు రామరాజు వచ్చి "వాడికి పెళ్లయ్యింది కానీ ఇంకేం జరగలేదు. చందు పెళ్ళైతే కానీ సాగర్ ఫస్ట్ నైట్ జరగదు" అంటూ చెప్పుకొచ్చాడు. వెంటనే శ్రీముఖి పెళ్ళైపోతుందిలే .. ఫస్ట్ నైట్ ప్రాప్తిరస్తూ అంటూ వాళ్ళను దీవించింది. ఇక ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ చేస్తున్న ఆమని ఈ షోకి ఫస్ట్ టైం వచ్చింది.

ఇక శ్రీముఖి ఐతే "హే భద్రావతి రావే చూసుకుందాం" అంటూ గట్టిగా చిటికేసి మరీ పిలిచింది. తర్వాత భద్రావతి ఫామిలీ రానే వచ్చింది. అందులో విశ్వాని చూసి ఫుల్ జోక్స్ వేసింది శ్రీముఖి. విశ్వాకి షేక్ హ్యాండ్ ఇచ్చి త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్నా ఇంతకు ఎలాంటి అమ్మాయి కావాలి అంటూ అడిగింది. దానికి ఆ విశ్వా ఐతే "నీలాంటి అమ్మాయి కావాలి" అంటూ శ్రీముఖిని చూపించేసరికి ఆమె తెగ సిగ్గుపడిపోయింది. అందరికీ "నేనే కావాలి" అంటూ తెగ ముచ్చటపడిపోయింది. తర్వాత రామరాజుని చూసిన శ్రీముఖి ఒక రిక్వెస్ట్ అంటూ "రామరాజు గారిలా గంభీరంగా కాకుండా ప్రభాకర్ గారిలా ఉంటే బాగుందనిపిస్తోంది" అనేసరికి "అలా ఐతే ఐ లవ్ యు శ్రీముఖి" అంటూ ప్రభాకర్ వెంటనే చెప్పేసాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.