English | Telugu

Bigg Boss 8 : చీప్ గా బిహేవ్ చేసిన చీఫ్ యష్మీ.. ప్రేరణ క్రూరత్వం!

బిగ్ బాస్ సీజన్-8 శుక్రవారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా హౌస్ మేట్స్ రాజకీయలు మొదలయ్యాయి. అంతేకాకుండా రెండు మూడు గ్రూపుల్లాగా అయ్యారు. యష్మీ చీఫ్ గా ఉండి తమ టీమ్ ని గెలిపించింది. అందులో పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడాడు అది వేరే విషయం. కాకపోతే యష్మీ నిఖిల్, నైనిక ముగ్గురు చీఫ్ లు కాబట్టి బిగ్ బాస్ కాన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. యష్మీ టీమ్ టాస్క్ లో గెలవడంతో బిగ్ బాస్ తనకి కొన్ని పవర్స్ ఇస్తాడు. ఆ పవర్ ఏంటంటే యష్మీ హౌస్ మేట్స్ కి పనులు అప్పగించే పవర్ వస్తుంది. (Bigg Boss 8 Telugu)

యష్మీ తన టీమ్ కాకుండా మిగతా వాళ్ళకి వర్క్ అలాట్ చేస్తుంది. నైనిక టీమ్ లోని కిర్రాక్ సీత, నబీల్ , విష్ణుప్రియ, ఇంట్లో వర్క్ అలాట్ చేస్తుంది. ఆ తర్వాత యష్మీ టీమ్ అంత కూడా నైనిక టీమ్ వాళ్ళని ఒక ఆట ఆడుకుంటారు. ఇంట్లో పనులన్నీ వాళ్ళ చేతే చేయిస్తారు. ప్రేరణ మరొక కోణం నిన్న బయట పడింది. కిచెన్ లో జ్యూస్ గ్లాస్ లో పోసుకొని బాటిల్ ని డస్ట్ బిన్ లో వేస్తుంది. వాళ్ళున్నారు కదా చేయడానికి అని మళ్ళీ డస్ట్ బిన్ లోని బాటిల్ ని తీసి టేబుల్ పై పెట్టింది ప్రేరణ. అది చూసి సీత నవ్వుకుంటూనే డస్ట్ బిన్ లో వేసింది. ఆ తర్వాత ప్రేరణ, అభయ్ నవ్వుకుంటుంటారు. యష్మీ టీమ్ అంతా కలిసి బయట జ్యూస్ తాగుతూ పార్టీ చేసుకుంటారు. ప్రేరణ కావాలనే బయటకు గొడుగులు తీసి బయటవేస్తుంది వాళ్ళున్నారు కదా క్లీన్ చెయ్యడానికి అంటుంది. ఆ తర్వాత అభయ్ ఆమ్లెట్ వేసుకుంటున్నానని అంటాడు. దాంతో ఆ డిషెస్ మీరే తోముకోవాలని కిర్రాక్ సీత అంటుంది. అది మా డ్యూటీ కాదని అభయ్ అంటాడు. ఇక మేమ్ పని మనుషులులాగా కన్పిస్తున్నామా అని అభయ్ తో గొడవ పెట్టుకుంటుంది కిర్రాక్ సీత.

మరోవైపు విష్ణుప్రియ తన బాధ చెప్పుకుంది‌. అసలు ఇదెక్కడి న్యాయం. పదిమంది చేసే పనంతా మమ్మల్ని చేయండంటూ ఆర్డర్లు వేయడమేంటి? నేను బిగ్‌బాస్‌కి వచ్చింది పనులు చేయడానికా అంటూ విష్ణు కాసేపు తిట్టుకుంది. ఏదో టైటిల్ గెలిచేద్దామనే ఫైర్‌తో లోపలికి వచ్చాను.. వీళ్ల వల్ల ఫైర్ అంతా ఆరిపోయింది. నేను అయితే ఒక్క పని కూడా చేయను.. నాగార్జున సర్ అడిగితే చెబుతా.. నేను ఏదో పర్సనాలిటీ డెవలెప్‌మెంట్ అనుకొని హౌస్‌లోకి వచ్చా కానీ ఇలా క్లీనింగ్ డెవలప్‌మెంట్ అవుతుందని అనుకోలేదు. బిగ్‌బాస్‌కి రావడం రాంగ్ డెసిషన్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. యష్మీ టీమ్ చేసే ఆగడాలకు నైనిక, విష్ణుప్రియ, కిర్రాక్ సీత ముగ్గురు ఆగమవుతున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...